అనుమానంతో భార్యపై కత్తితో దాడి..!

అమరావతి: ఎపిలోని కృష్ణా జిల్లా నూజివీడులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త విచక్షణా రహితంగా కత్తితో దాడి చేసి పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నూజివీడు మండలం వేంకటాయపాలెంకు చెందిన భుక్యా భీముడు తన భార్య కనకమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావని అనుమానంతో తరచూ గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో భీముడు భార్యపై అనుమానం కాస్తా పెనుభూతంగా మారి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న కనకమ్మను […]

అమరావతి: ఎపిలోని కృష్ణా జిల్లా నూజివీడులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త విచక్షణా రహితంగా కత్తితో దాడి చేసి పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నూజివీడు మండలం వేంకటాయపాలెంకు చెందిన భుక్యా భీముడు తన భార్య కనకమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావని అనుమానంతో తరచూ గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో భీముడు భార్యపై అనుమానం కాస్తా పెనుభూతంగా మారి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న కనకమ్మను స్థానికులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా  సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడు భీముని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

comments

Related Stories: