తుపాన్‌గా మారిన తీవ్రవాయుగుండం

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి తీవ్రవాయుగుండం తుపానుగా మారింది. ఈ తుపానుకు దయెగా నామకరణం చేశారు. కళింగపట్నం-పారాదీప్ మధ్య గోపాల్‌పూర్ సమీపంలో ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉంది. దయె తుపాను ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 15 కిలో మీటర్ల దూరంలో, కళింగపట్నానికి 130 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 20 కిలో మీటర్ల వేగంతో ఒడిశాకు ఉత్తర వాయువ్య దిశగా తుపాను కదులుతుంది. రానున్న ఆరు గంటల్లో దయె తుపాను తీవ్ర వాయుగుండంగా […]

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి తీవ్రవాయుగుండం తుపానుగా మారింది. ఈ తుపానుకు దయెగా నామకరణం చేశారు. కళింగపట్నం-పారాదీప్ మధ్య గోపాల్‌పూర్ సమీపంలో ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉంది. దయె తుపాను ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 15 కిలో మీటర్ల దూరంలో, కళింగపట్నానికి 130 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 20 కిలో మీటర్ల వేగంతో ఒడిశాకు ఉత్తర వాయువ్య దిశగా తుపాను కదులుతుంది. రానున్న ఆరు గంటల్లో దయె తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. తీరం దాటిన తరువాత దయె తుపాను వాయుగుండంగా బలహీనపడనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మత్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

Related Stories: