భారత, పాక్ విదేశాంగ మంత్రుల భేటీ

 న్యూయార్క్‌లో జరపడానికి నిర్ణయం  పాక్ ప్రధాని ఇమ్రాన్ లేఖకు సానుకూలంగా స్పందించిన భారత్ న్యూఢిల్లీ: ఉగ్రవాదం, కాశ్మీర్ సహా ఇరు దేశాల సంబంధాలకు సవాలుగా మారుతు న్న ప్రధాన సమస్యలపై భారత్, పాక్‌ల మ ధ్యద్వైపాక్షిక చర్చలు తిరిగి ప్రారంభం కా వాలని,  ఈ నెల చివరినుంచి న్యూయార్క్ లో జరగనున్న ఐరాస జనరల్ అసెంబ్లీ స మావేశాల సందర్భంగా రెండు దేశాల విదేశాం గ మంత్రుల సమావేశం జరగాలని కోరుతూ పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ […]

 న్యూయార్క్‌లో జరపడానికి నిర్ణయం
 పాక్ ప్రధాని ఇమ్రాన్ లేఖకు సానుకూలంగా స్పందించిన భారత్

న్యూఢిల్లీ: ఉగ్రవాదం, కాశ్మీర్ సహా ఇరు దేశాల సంబంధాలకు సవాలుగా మారుతు న్న ప్రధాన సమస్యలపై భారత్, పాక్‌ల మ ధ్యద్వైపాక్షిక చర్చలు తిరిగి ప్రారంభం కా వాలని,  ఈ నెల చివరినుంచి న్యూయార్క్ లో జరగనున్న ఐరాస జనరల్ అసెంబ్లీ స మావేశాల సందర్భంగా రెండు దేశాల విదేశాం గ మంత్రుల సమావేశం జరగాలని కోరుతూ పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రధాని మోడీకి రాసిన లేఖపై భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఐక్యరాజ్య జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, పాక్ విదేశాంగ మంత్రి ఆ మహమ్మద్ ఖురేషిల మధ్య సమావేశం జరుగుతుందని విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. అయితే ఇది కేవలం సమావేశం మాత్రమేనని, చర్చలు తిరిగి ప్రారంభం అయినట్లు భావించరాదని విదేశాంగ శాఖ ప్రతినిధి రావీశ్ కుమార్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ అభ్యర్థనపై ఈ సమావేశం జరుగుతున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఏమి చర్చించాలనేది ఇంకా నిర్ణయించలేదని, అయితే ఇరు దేశాలకు అనుకూలమైన తేదీన ఈ సమావేశం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. గత నెల పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇమ్రాన్ ఖాన్‌ను అభినందిస్తూ లేఖ రాసిన ప్రధాని నరేంద మోడీ భారత్, పాక్‌ల మధ్య నిర్మాణాత్మక సహకారం కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. మోదీ లేఖకు ఇమ్రాన్ స్పందిస్తూ, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి తేదీని ఖరారు చేయాలని కోరారు. అంతేకాదు, ఇరు దేశాల మధ్య అన్ని కీలక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి పాక్ సంసిద్ధంగా ఉందని కూడా ఆయన ఆ లేఖలో తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ లేఖకు సానుకూలంగా స్పందిస్తూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ నెల 14న ఈ లేఖ రాసినట్లు పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ ట్విట్టర్‌లో తెలిపారు. వీలయితే సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ముందే ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగేలా చూడాలని కూడా ఇమ్రాన్ ఆ లేఖలో కోరినట్లు ఫైజల్ తెలిపారు.

Comments

comments