నెత్తురు కక్కించిన విమాన ప్రయాణం

ముంబై : జెట్ ఎయిర్‌వేస్ విమానం ముంబై నుంచి జైపూర్‌కు వెళ్లేందుకు బయలుదేరింది. ప్రయాణికులు అంతా సర్దుకుని కూర్చున్నారు. విమానం ఎగరగానే కొద్ది సేపటికి ప్రయాణికుల ముక్కులు, చెవుల నుంచి నెత్తురు కారింది, వారంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. దీనితో ఇదేం విమాన ప్రయాణం? జైపూర్ యాత్రనా? యమపురి ప్రయాణమా అని తల్లడిల్లారు. విమానం ఎగురడానికి ముందు కచ్చితంగా పాటించాల్సిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం, ముఖ్యంగా క్యాబిన్‌లో గాలి ఒత్తిడిని నియంత్రించే స్విచ్చ్‌ను ఆన్ చేయకపోవడంతో ప్యాసింజర్లు నెత్తురు చవిచూడాల్సి […]

ముంబై : జెట్ ఎయిర్‌వేస్ విమానం ముంబై నుంచి జైపూర్‌కు వెళ్లేందుకు బయలుదేరింది. ప్రయాణికులు అంతా సర్దుకుని కూర్చున్నారు. విమానం ఎగరగానే కొద్ది సేపటికి ప్రయాణికుల ముక్కులు, చెవుల నుంచి నెత్తురు కారింది, వారంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. దీనితో ఇదేం విమాన ప్రయాణం? జైపూర్ యాత్రనా? యమపురి ప్రయాణమా అని తల్లడిల్లారు. విమానం ఎగురడానికి ముందు కచ్చితంగా పాటించాల్సిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం, ముఖ్యంగా క్యాబిన్‌లో గాలి ఒత్తిడిని నియంత్రించే స్విచ్చ్‌ను ఆన్ చేయకపోవడంతో ప్యాసింజర్లు నెత్తురు చవిచూడాల్సి వచ్చింది. అసలు ఏం జరుగుతుం దో తెలియకపోవడం, విపరీత వేగంతో గాలి వచ్చి వారు భరించలేని తలపోట్లకు గురయ్యారు. దీనితో వారు పెట్టిన కేకలతో విమానాన్ని హుటాహుటిన తిరిగి ముంబై విమానాశ్రయానికి చేర్చారు. వెంటనే బాధితులైన ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్క్‌లతో స్వస్థత కల్పించారు. ఇతరత్రా చికిత్స అందించారని విమానయాన నియంత్రణ డైరెక్టరేట్ జనరల్ అధికారి ఒకరు తెలిపారు. బోయింగ్ 737 విమానంలో ఈ సమయంలో 166 మంది ప్రయాణికులు ఉన్నా రు. ఐదుగురు విమాన సిబ్బంది కూడా ఉంది. తీవ్రమైన వాయుఒత్తిడికి గురి కావడంతో వారు చాలా సేపటివరకూ ఇబ్బందికి గురయ్యారని , జరిగిన దానికి చింతిస్తున్నామని జెట్ ఎయిర్‌వేస్ ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులలో 30 మందికి అస్వస్థత కల్గిందని, ఘటనపై పూర్వాపరాలను తెలుసుకుంటున్నామని అధికార వర్గాలు తెలిపాయి. సాధారణంగా విమానం బయలుదేరే ముందు పైలెట్ ఇతర సాంకేతిక సిబ్బంది యంత్రాలను నిశితంగా పరిశీలించుకోవల్సి ఉంటుంది. ప్రయాణికులపై వాయు ఒత్తిడిని తగ్గించేందుకు ఏర్పాటు అయిన యం త్రాన్ని ఆన్ చేయాల్సి ఉంటుంది. అది చేయకుండానే విమాన ప్రయాణం సాగించడం చివరికి ప్రయాణికుల చెవ్వుల్లో తుపాన్లు పెట్టినట్లే అని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.

Comments

comments