చేతులు కలిపిన కిమ్, మూన్

పియాంగ్‌యాంగ్ : పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతాన్ని తలపించిన ఉత్తర కొరియా, దాని శత్రు దేశమైన దక్షిణ కొరియాల  మధ్య జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి. ఇరుదేశాల నేతలైన కిమ్ జోంగ్ ఉన్, మూన్ జే ఇన్‌ల మధ్య జరుగుతున్న చర్చల చివరి రోజు రెండు దేశాల మధ్య పవిత్ర బంధానికి సమ్మతించారు. ఇది తాము సాధించిన గొప్ప విజయమని తెలిపారు. ఉత్తర కొరియా, చైనా సరిహద్దులో ఇరు దేశాల నేతలు జరిపిన సమావేశంలో రోజంతా అనేక […]

పియాంగ్‌యాంగ్ : పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతాన్ని తలపించిన ఉత్తర కొరియా, దాని శత్రు దేశమైన దక్షిణ కొరియాల  మధ్య జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి. ఇరుదేశాల నేతలైన కిమ్ జోంగ్ ఉన్, మూన్ జే ఇన్‌ల మధ్య జరుగుతున్న చర్చల చివరి రోజు రెండు దేశాల మధ్య పవిత్ర బంధానికి సమ్మతించారు. ఇది తాము సాధించిన గొప్ప విజయమని తెలిపారు. ఉత్తర కొరియా, చైనా సరిహద్దులో ఇరు దేశాల నేతలు జరిపిన సమావేశంలో రోజంతా అనేక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇది శాంతి స్థాపనలో అతి పెద్ద అడుగని అన్నారు. గతంలో రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని వణికించాయి. ఉత్తర కొరియా చేపట్టిన అణ్వస్త్ర క్షిపణిల తయారీ, క్షిపణిల ప్రయోగాలు అమెరికాకు సవాలుగా మారాయి. ఖండాంతర క్షిపణిలను ఉత్తర కొరియా వరుసగా జపాన్ సముద్ర జలల్లోకి ప్రయోగించింది. అమెరికా హెచ్చరికలను కాలదన్నింది. తమ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయని, అవసరమైతే వాటిని ప్రయోగిస్తామని అమెరికా, ఉత్తర కొరియాలు హెచ్చరించుకున్నాయి. ఉత్తర కొరియాతో అమెరికా  జరిపే సంప్రదింపుల చర్యలు అనిర్దిష్టంగా ఉంటేనే  తమ అణ్వస్త్ర తయారీ కేంద్రాన్ని శాశ్వతంగా  నాశనం చేస్తామని ఉత్తర కొరియా నిబంధన విధించింది. కిమ్, మూన్ వేరు వేరు విమానాల్లో సరిహద్దుకు చేరుకుని, అక్కడి కొండపైకి చేరి చర్చలు జరిపారు. అక్కడ  జరిపిన సమావేశపు ఫొటోలను విడుదల చేశారు. ఈ ఫొటోల్లో కిమ్, మూన్ పెద్ద పెట్టున నవ్వుతూ కనిపించారు. వారి భార్యలు ప్రక్కనే నిలబడి ఉన్నారు. సమావేశమైన ప్రదేశంలో ఓ సరస్సు ఉంది. దాని తీరంలో  ఇరు దేశాల నేతలు వారి భార్యలు కలిసి  షికారు చేసిన ఫొటోలను విడుదల చేశారు.

Comments

comments

Related Stories: