ప్రాణాలు తీయడం పరువు తక్కువ పని

కుల హింస మానవతకు మచ్చ, అనాగరిక చర్య, పెళ్లి ద్వారా రెండు కులాలు కలవడం సామాజిక వేడుక : మంత్రి హరీశ్‌రావు ట్వీట్ మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రాణా లు తీయడాన్ని మించిన పరువు తక్కువ పని మరొకటి లేదని, కుల వివక్ష ఒక సా మాజిక రు గ్మత అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కుల వివక్ష అనేది ఒక అనాగరిక సమాజపు పరంపర అని, నాగరిక సమాజాల్లో అలాంటి వివక్షకు తావులేదని […]

కుల హింస మానవతకు మచ్చ, అనాగరిక చర్య,
పెళ్లి ద్వారా రెండు కులాలు కలవడం సామాజిక వేడుక : మంత్రి హరీశ్‌రావు ట్వీట్

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రాణా లు తీయడాన్ని మించిన పరువు తక్కువ పని మరొకటి లేదని, కుల వివక్ష ఒక సా మాజిక రు గ్మత అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కుల వివక్ష అనేది ఒక అనాగరిక సమాజపు పరంపర అని, నాగరిక సమాజాల్లో అలాంటి వివక్షకు తావులేదని స్పష్టం చేశారు. పరువు హత్యలపై మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌లో పై విధంగా స్పందించారు. పంతాలు, పట్టింపులకు పోయి బిడ్డల ప్రాణాలు తీయొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కులం పేరుతో జరిగే హింస మానవతకి మచ్చ అని ఆవేదన వ్యక్తంచేశారు. పెళ్లి ద్వారా రెండు కులాలు క లుస్తున్నాయంటే అదొక సా మాజిక వేడుక కావాలని పిలుపునిచ్చా రు. అంతరాలను అంతంచేసే కులాంతర వివాహం అనే ముందడుగును స్వాగతించాలన్నా రు. ఎదిగిన బిడ్డల స్వేచ్ఛని గౌరవించాలని కోరారు. నాగరికతతో పాటు నడుద్దామని, కుల విద్వేషాలకు దూరంగా ఉందామని  ట్విట్టర్ ద్వారా హితవుపలికారు. మిర్యాలగూడలో ప్రణయ్ హ త్య, ఎర్రగడ్డలో నవదంపతులపై యువతి తండ్రి దాడి చేసిన సం ఘటనల నేపథ్యంలో మంత్రి ట్విట్టర్ ద్వారా స్పందించారు.

Related Stories: