ఎలుగు హలోచల్

 కరీంనగర్ బిఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్‌లో ప్రవేశించిన ఎలుగుబంటి  కార్యాలయంలో గదులన్నింటా తిరుగుతూ హల్‌చల్  భయంతో పరుగులు తీసిన సిబ్బంది  ఏడెనిమిది గంటలు ప్రయత్నించి బంధించిన అటవీశాఖ సిబ్బంది  హైదరాబాద్‌కు తరలింపు మన తెలంగాణ/కరీంనగర్ క్రైం : ఎక్కడి నుం డి వచ్చిందో ఏమో కాని ఓ ఎలుగుంటి గురువారం నగరంలోనికి ప్రవేశించి హల్‌చల్ చేసిం ది. విషయం తెలిసిన అధికారులు గంటల తరబడి శ్రమించి ఎట్టకేలకు ఎలుగుబంటిని పట్టుకుని బంధించగలిగారు. నగర నడిబొడ్డులోని టవర్‌సర్కిల్ ప్రాంతంలో గల బి.ఎస్.ఎన్.ఎల్ […]

 కరీంనగర్ బిఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్‌లో ప్రవేశించిన ఎలుగుబంటి
 కార్యాలయంలో గదులన్నింటా తిరుగుతూ హల్‌చల్
 భయంతో పరుగులు తీసిన సిబ్బంది
 ఏడెనిమిది గంటలు ప్రయత్నించి బంధించిన అటవీశాఖ సిబ్బంది
 హైదరాబాద్‌కు తరలింపు

మన తెలంగాణ/కరీంనగర్ క్రైం : ఎక్కడి నుం డి వచ్చిందో ఏమో కాని ఓ ఎలుగుంటి గురువారం నగరంలోనికి ప్రవేశించి హల్‌చల్ చేసిం ది. విషయం తెలిసిన అధికారులు గంటల తరబడి శ్రమించి ఎట్టకేలకు ఎలుగుబంటిని పట్టుకుని బంధించగలిగారు. నగర నడిబొడ్డులోని టవర్‌సర్కిల్ ప్రాంతంలో గల బి.ఎస్.ఎన్.ఎల్ కార్యాలయంలోనికి ఓ ఎలుగుబంటి వచ్చింది. అది ఒక్క చోట ఉండకుండా కార్యాలయంలోని వివిధ గదులను తిరుగుతుండటంతో పట్టుకుని బంధించడం అధికారులకు కష్టమైంది. ఎప్పటి లాగే ఉదయం పూట కార్యాలయానికి వచ్చిన బి.ఎస్.ఎన్.ఎల్ సిబ్బందికి ఎలుగుబంటి కనిపిం చడంతో వారు భయంతో పరుగులు తీశారు. విషయాన్ని ఉన్నతాధి కారులకు తెలియజేశారు. స్పందించిన అధికారులు వెంటనే అటవీశాఖ అధికారులతో పాటు పోలీస్‌శాఖ ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేయ గా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి విచ్చేసి టవర్‌సర్కిల్ ప్రాంతంలోని అన్ని దారులను మూసివేశారు. బి.ఎస్.ఎన్.ఎల్ కార్యాలయం చట్టుపక్కల ఎవ రూ ఉండకుండా చూడాలని ఆయన తన సిబ్బందిని ఆదేశించారు. నగరవాసులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోగా వారిని అదుపు చేసేందుకు పోలీసులు రోప్‌పార్టీని పిలిపించి అన్ని దారులను తాళ్ళతో మూసివేశారు. ఎలుగబంటిని పట్టుకుని బంధించేందుకు అవసరమైన వలను ఇతర సామా గ్రిని తెప్పించి దాదాపు ఏడెనిమిది గంటల తర్వాత ఎలుగుకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించగలిగారు. ఒక బోన్‌లో పెట్టి హైద్రాబాద్‌లోని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.కారడవి నుండి జనారణ్యంలోనికి వచ్చిన ఎలుగుంటిని చూసేందుకు వచ్చిన ప్రజలు తమ మొబైల్‌లో ఎలుగుంటిని పట్టుకునే దృశ్యాలను చిత్రీకరించేందుకు ఉత్సాహన్ని కనబరిచారు. వారిని అదుపు చేసేందుకు కరీంనగర్ వన్‌టౌన్ సిఐ తుల శ్రీనివాస్‌రావు, ఎస్.ఐ నాగరాజు, ఆర్.ఐ మల్లేశం తదితరులు శ్రమించాల్సి వచ్చింది. ఎలుగుబంటి ఉన్న బంగ్లా చుట్టుపక్కల ప్రజలను లేకుండా చేయడంతో ఆ ప్రాంతమంతా కర్ఫూ వాతావరణాన్ని తలపించింది. ఎట్టకేలకు వరంగల్ నుండి విచ్చేసిన ప్రత్యేక నిపుణుల బృందం తుపాకీ ద్వారా ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్ చేసి బంధించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

Related Stories: