కూటమిలో సీట్ల కుమ్ములాట

 చర్చలకు తాతాలిక బ్రేక్  ఎక్కువ సీట్ల కోసం టిడిపి పట్టు  31 స్థానాలపై దృష్టి  స్పష్టతనివ్వని కాంగ్రెస్  మిత్రపక్షాలకు కాంగ్రెస్ బిఫాంలు ఇచ్చే వ్యూహం  అటునుంచి అంగీకారం ప్రశ్నార్థకం  కోర్టు కేసులున్నా ఎన్నికలు ఖాయమంటున్న ఉత్తమ్ మన తెలంగాణ/హైదరాబాద్: మహాకూటమిలో తాత్కాలికంగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా సీట్ల సర్దుబాటుపై జరిగిన చ ర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కాంగ్రెస్‌లో పోటీ చే యడానికి ఆశావహుల జాబితా ఎక్కువగా ఉండ డం, దాదాపు 90 […]

 చర్చలకు తాతాలిక బ్రేక్
 ఎక్కువ సీట్ల కోసం టిడిపి పట్టు
 31 స్థానాలపై దృష్టి
 స్పష్టతనివ్వని కాంగ్రెస్
 మిత్రపక్షాలకు కాంగ్రెస్ బిఫాంలు ఇచ్చే వ్యూహం
 అటునుంచి అంగీకారం ప్రశ్నార్థకం
 కోర్టు కేసులున్నా ఎన్నికలు ఖాయమంటున్న ఉత్తమ్

మన తెలంగాణ/హైదరాబాద్: మహాకూటమిలో తాత్కాలికంగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా సీట్ల సర్దుబాటుపై జరిగిన చ ర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కాంగ్రెస్‌లో పోటీ చే యడానికి ఆశావహుల జాబితా ఎక్కువగా ఉండ డం, దాదాపు 90 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుండడంతో దీని పై స్పష్టత వచ్చేంత వరకు కూటమి పార్టీలకు కేటాయించే సీట్లపై స్పష్టత రాదన్న ఉద్దేశంతో చర్చలకు తాత్కాలికంగా విరామం ప్రకటించినట్లు తెలిసిం ది. గెలిచే నియోజకవర్గాలను ఎట్టిపరిస్థితుల్లో వదులుకోవద్దంటూ స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర నేతలకు స్పష్టత ఇవ్వడంతో సీట్ల సంఖ్యపై పట్టుదలగానే ఉంది. తెలుగుదేశం దాదాపు 35 స్థానాలపై దృష్టి పెట్టినా కనీసం ఇరవై స్థానాలను సీట్ల సర్దుబాటులో దక్కించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే తొమ్మిది నియోజకవర్గాల గురించి కాంగ్రెస్‌కు వివరించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో 72 స్థానాల్లో పోటీచేసి 15 నియోజకవర్గాల్లో గెలిచినప్పటికీ 12 మంది టిఆర్‌ఎస్‌లో, ఒకరు కాంగ్రెస్‌లో చేరిపోవడంతో ఇప్పు డు ఆ పార్టీలో ఇద్దరే మిగిలారు. ఈ 15 స్థానాల్లో మళ్ళీ పోటీ చేయడంతో పాటు గత ఎన్నికల్లో రెం డవస్థానంలో నిలిచిన 16 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నేతలకు వివరించడంతో స్పష్టమైన నిర్ణయమేదీ తీసుకోలేకపోయిన కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో 14.66 శాతం ఓట్లు సాధించిన టిడిపికి కూటమిలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతుండటంతో కాంగ్రెస్ ధై ర్యంగా నిర్ణయం తీసుకోలేకపోతోం ది. గత ఎన్నికల్లో 37 స్థానాల్లో పోటీచేసి దేవరకొండ నియోజక వర్గాన్ని సొంతం చేసుకున్న సిపిఐ ఈ సారి కనీసం ఏడు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ద్వితీయ స్థానంలో నిలిచిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. దేవరకొండతో పాటు బెల్ంలపల్లి, మునుగోడు, వైరా, కొత్తగూడెం, హుస్నాబాద్‌లో కచ్చితంగా పోటీ చేయాలని భావిస్తోంది. కొత్తగా ఉనికిలోకి వచ్చిన తెలంగాణ జన సమితి గెలుపు గుర్రాలను కూటమినుంచి రంగంలోకి దిం చేందు కు సిద్ధమవుతుంది. కూటమి భాగస్వామ్య పక్షాలు పట్టు వీడక పోవడంతో
ఏ నిర్ణయాన్ని ప్రకటించలేక, కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించలేక టిపిసిసి తలపట్టుకుంటుంది. ఒకవైపు పార్టీలో అభ్యర్థుల ఒత్తిడి, మరో వైపు కూటమి ఒత్తిడితో కాంగ్రెస్ అడకత్తెర తరహాలో ఇబ్బంది పడుతోంది. పార్టీ సొంత వ్యవహారాలతోనే ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మహాకూటమికి ఏమేరకు న్యాయం చేస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సీట్ల కేటాయింపులపై కాంగ్రెస్‌కు స్పష్టత లేదు
మహాకూటమి డిమాండ్ల పత్రాన్ని తీర్చలేక, వారి కోరికలను నెరవేర్చలేక తాత్కాలికంగా తెలంగాణ కాంగ్రెస్ చర్చలకు తెరదించింది. ఇంటిని చక్కబెట్టుకున్న తర్వాతనే కూటమి వ్యవహారాలపై దృష్టి సారించాలని ఆలోచిస్తోంది. గెలిచే స్థానాలను వదులుకునేది లేదని చెపుతున్న కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో పక్కాగా గెలుస్తామనే అంచనా కూడా లేకుండా పోయింది.
ఎన్నికలకు మేం సిద్ధం : ఉత్తమ్
ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. మహాకూటమి సీట్ల కేటాయింపులు భాగస్వామ్యపక్షాలకు అనుకూలంగానే ఉంటాయని అన్నారు. శుక్రవారంతో కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత వెంటనే మహాకూటమితో చర్చలు ప్రారంభించి సీట్ల కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. న్యాయపరమైన చిక్కులు లేకుంటే అక్టోబర్ 15కల్లా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, నవంబర్ చివరి వారంలో పోలింగ్ జరిగే అవకాశాలే అధికంగా ఉన్నట్లు పార్టీ అంచనా వేస్తున్నట్లు ‘మన తెలంగాణ’కు తెలిపారు. ఎన్నికల ఉమ్మడి ప్రణాళిక, మహాకూటమి బహిరంగసభ అంశాలపై ఇంకా స్పష్టత రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కాంగ్రెస్‌లో ‘బి ఫాం’ లొల్లి
మహాకూటమి అధిక సీట్లు కోరుకుంటే కాంగ్రెస్ గెలిచే స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుందని నాయకులన్నారు. అన్ని పక్షాలకు అనుకూలంగా బలా బలాలను అంచనా వేసిన అనంతరం కూడా ఇంకా సీట్లు కావాలని డిమాండ్ వస్తే కాంగ్రెస్ బి ఫాం ఇవ్వాలని నాయకులు టిపిసిసికి చెప్పినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ బి ఫాం నుంచి పోటీలో ఉంటే టెక్నికల్ గా అభ్యర్థి కాంగ్రెస్ సభ్యుడిగానే కొనసాగాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రతిపాదన మహాకూటమి అంగీకరిస్తాందానేది ప్రశ్నార్థకమే.

Related Stories: