5 ట్రిలియన్ డాలర్లకు భారత్ ఆర్థికవ్యవస్థ: ప్రధాని

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 2022 నాటికి 5 ట్రిలి యన్ డాలర్ల సైజుకు చేరుకుంటుందని, దానికి తయారీ, వ్యవసాయ రంగం చెరో ట్రిలియన్ డాలర్లను అందించనున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం చెప్పారు. ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌కు పునాది వేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. ఈ వారం దీనా బ్యాంక్, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాల విలీన ప్రకటన వెలువడిందని, దీంతో దేశంలో మూడో […]

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 2022 నాటికి 5 ట్రిలి యన్ డాలర్ల సైజుకు చేరుకుంటుందని, దానికి తయారీ, వ్యవసాయ రంగం చెరో ట్రిలియన్ డాలర్లను అందించనున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం చెప్పారు. ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌కు పునాది వేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. ఈ వారం దీనా బ్యాంక్, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాల విలీన ప్రకటన వెలువడిందని, దీంతో దేశంలో మూడో అతిపెద్ద లెండర్లు గా ఈ బ్యాంకులు మారనున్నాయని అన్నారు. జాతీ య ప్రయోజనాల దృష్టా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడబోదన్నారు.భారత ఆర్థికవ్యవస్థ గురిం చి మాట్లాడుతూ ఐటి, రిటైల్ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగకల్పన జరగడంతో వృద్ధి రేటు 8 శాతం ఉండనున్నదని ప్రధాని మోడీ అన్నారు.దేశ స్థూల ఆర్థిక పునాదులు బల ంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రోత్సహించిన ‘మేక్ ఇన్ ఇండియా’ ఫలితం గా దేశంలో ప్రస్తుతం 80 శాతం మొబైల్ ఫోన్ల ఉత్పత్తి జరుగుతోందన్నారు. దీంతో దేశానికి రూ. 3 లక్షల కోట్ల విదేశీ మారకం ఆదా అవుతోందన్నారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోడానికి ప్రభుత్వానికి దమ్ముందన్నారు. ఇందుకు ఉదాహరణగా ఆయన బ్యాంకుల విలీనం,17 కేంద్ర, రాష్ట్ర పన్నులను కలిపేసి వస్తు,సేవల పన్నును అమలు చేశామన్నారు. ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో ఇవి కొన్ని అన్నారు.

 మెట్రోలో ప్రధాని ప్రయాణం 

ధౌలా కువా మెట్రో స్టేషన్ నుంచి ద్వారక సెక్టార్ 21 మెట్రో స్టేషన్‌కు గురువారం ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించారు. ‘ఇండియా ఇంటరేషనల్  కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్’కు పునాది రాయి వేయడానికి ముందు 14 నిమిషాలపాటు ఆయన ఈ ప్రయాణం చేశారని మెట్రో అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా మెట్రో రైలులో ప్రధాని ప్రయాణించడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపా రు. ఆయన కూడా వారిని అనుమతించారు. ‘ఢిల్లీ మెట్రోలో దరహాసాలు. కన్వెషన్ సెంటర్‌కు పునా ది రాయి వేశాక ద్వారక నుంచి తిరుగు ప్రయాణం చేసినే ప్రధాని నరేంద్ర మోడీతో ప్రజల మాటామంతీ’ అని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేయడమేకాక ఆ ఫోటోలను పెట్టింది. ప్రముఖ వ్యక్తులు ప్రయాణిస్తున్నప్పుడు ఏరడే ట్రాఫిక్ జామ్‌ను తప్పించేందుకు ప్రధాని మెట్రో సేవలను ఎంచుకున్నారని సమాచారం.