ప్రణయ్ కుటుంబాన్ని పరామర్శించిన జగదీశ్ రెడ్డి

నల్లగొండ: ప్రణయ్ కుటుంబానికి మంత్రి జగదీశ్ రెడ్డి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గురువారం ప్రణయ్ కుటుంబాన్ని జగదీశ్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలో ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వ్యక్తులకు సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరముందన్నారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారని, ప్రభుత్వం ఇలాంటి సంఘటనలను సహించదని హెచ్చరించారు.   మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ కుటుంబాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపి లింగయ్య యాదవ్, మాజీ ఎంఎల్‌ఎ భాస్కర్ […]

నల్లగొండ: ప్రణయ్ కుటుంబానికి మంత్రి జగదీశ్ రెడ్డి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గురువారం ప్రణయ్ కుటుంబాన్ని జగదీశ్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలో ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వ్యక్తులకు సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరముందన్నారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారని, ప్రభుత్వం ఇలాంటి సంఘటనలను సహించదని హెచ్చరించారు.   మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ కుటుంబాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపి లింగయ్య యాదవ్, మాజీ ఎంఎల్‌ఎ భాస్కర్ రావు, గాదరి కిశోర్, కలెక్టర్, ఎస్‌పి రంగనాథ్ పరామర్శించారు.  నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గత శుక్రవారం పెరుమాళ్ళ ప్రణయ్(25) అనే యువకుడిని అత్యంత దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్నందుకే పరువు హత్య చేయించానని అమృత తండ్రి అంగీకరించిన విషయం విదితమే.

Jagadeesh Reddy Visit Pranay Family

Telangana news

Comments

comments

Related Stories: