‘ఆ ఎన్నికలకు వెళ్లొద్దని రాజ్యాంగంలో లేదు’

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు  ప్రయత్నం చేస్తున్నారని ఎంపి వినోద్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చనిపోయినవారి పేరు మీద కాంగ్రెస్ నేతలు కేసులు వేసిన సందర్భాలు ఉన్నాయని మండిపడ్డారు. గతంలో పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికలకు ఎప్పుడైనా సిద్దమేనని అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మర్రి శశిధర్ రెడ్డి ముందస్తు ఎన్నికలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించారని ఆరోపణలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లొద్దని రాజ్యాంగంలో […]

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు  ప్రయత్నం చేస్తున్నారని ఎంపి వినోద్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చనిపోయినవారి పేరు మీద కాంగ్రెస్ నేతలు కేసులు వేసిన సందర్భాలు ఉన్నాయని మండిపడ్డారు. గతంలో పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికలకు ఎప్పుడైనా సిద్దమేనని అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మర్రి శశిధర్ రెడ్డి ముందస్తు ఎన్నికలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించారని ఆరోపణలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లొద్దని రాజ్యాంగంలో ఎక్కడ లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షం ఉండడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. మళ్లీ ప్రజలు టిఆర్‌ఎస్‌నే ఆదరిస్తారని ఆశాబావం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని వినోద్ ఎద్దేవా చేశారు.

MP Vinod Comments on Congress Party

Telangana news

Comments

comments

Related Stories: