నవాజ్ షరీఫ్ జైలు శిక్ష నిలిపివేత

ఇస్లామాబాద్: అవినీతి కేసులో జైలుపాలైన పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయ న కుమార్తె మరియం, అల్లుడు కెప్టెన్ (రిటైర్డ్) మొహమ్మద్ సఫ్దార్‌ల శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు బుధవారం తాత్కాలికంగా నిలిపివేసింది. జస్టిస్ అథర్ మినల్లా, జస్టిస్ మియంగుల్ హసన్ ఔరంగజేబులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. ఈ కేసులో అకౌంటబులిటీ కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేసింది. వీరు చట్టాల్ని ఉల్లంఘించలేదని, అవినీతి డబ్బుతో లండన్‌లో విలాసవంత ఫ్లాట్లు కొన్నారనడానికి రుజువులు లేవని ధర్మాసనం […]

ఇస్లామాబాద్: అవినీతి కేసులో జైలుపాలైన పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయ న కుమార్తె మరియం, అల్లుడు కెప్టెన్ (రిటైర్డ్) మొహమ్మద్ సఫ్దార్‌ల శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు బుధవారం తాత్కాలికంగా నిలిపివేసింది. జస్టిస్ అథర్ మినల్లా, జస్టిస్ మియంగుల్ హసన్ ఔరంగజేబులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. ఈ కేసులో అకౌంటబులిటీ కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేసింది. వీరు చట్టాల్ని ఉల్లంఘించలేదని, అవినీతి డబ్బుతో లండన్‌లో విలాసవంత ఫ్లాట్లు కొన్నారనడానికి రుజువులు లేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవెన్‌ఫీల్డ్ ప్రాపర్టీ కేసులో షరీఫ్‌కు 11 ఏళ్లు, మరియం 8 ఏళ్లు, అల్లుడు కెప్టెన్ సఫ్దార్‌కు ఏడాది జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రూ. 5 లక్షల బాండ్ పూచీకత్తుపై శిక్షను అనుభవిస్తున్న ఈ ముగ్గుర్ని విడుదల చేయాలని ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ ఏడాది జూలై 6న అవినీతి కేసులో అకౌంటబులిటీ కోర్టు వారికి శిక్ష విధించిన విషయం తెలిసిందే. తమకు విధించిన శిక్షపై వీరు ఇస్లామాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఇటీవల రిజర్వ్‌లో ఉంచింది. కాగా బుధవారం వారి శిక్షను సస్పెండ్ చేసింది. గత వారం, లండన్‌లో క్యాన్సర్‌తో చనిపోయిన షరీఫ్ భార్య కుల్సుం అంత్యక్రియల నిమిత్తం నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె 5రోజుల పెరోల్‌పై విడుదలయ్యారు. తాజా తీర్పుతో వీరిద్దరితోపాటు నవాజ్ షరీఫ్ అల్లుడు కెప్టెన్ సఫ్‌దార్ కూడా విడుదల కానున్నారు.

Comments

comments

Related Stories: