ట్రిపుల్ తలాక్

కీలక ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులివ్వడం నేరం, పాల్పడే భర్తకు కనీసం మూడేళ్లు శిక్ష, కేసు విచారణకు ముందు బెయిల్‌కు అవకాశం, రాజీకి కూడా వీలు, బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉండడంతో సత్వర అవసరంగా ఆర్డినెన్స్ తీసుకురాదలచిన కేంద్రం న్యూఢిల్లీ : వివాదాస్పదమైన ముమ్మారు తలాక్ ఇకపై శిక్షార్హ నేరం కానుంది. తక్ష ణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధించేందుకు, దీనిని నేరంగా ప రిగణించేందుకు ఉద్ధేశించిన ఆర్డినెన్స్‌కు బుధవారం కేం ద్ర […]

కీలక ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులివ్వడం నేరం, పాల్పడే భర్తకు కనీసం
మూడేళ్లు శిక్ష, కేసు విచారణకు ముందు బెయిల్‌కు అవకాశం,
రాజీకి కూడా వీలు, బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉండడంతో
సత్వర అవసరంగా ఆర్డినెన్స్ తీసుకురాదలచిన కేంద్రం

న్యూఢిల్లీ : వివాదాస్పదమైన ముమ్మారు తలాక్ ఇకపై శిక్షార్హ నేరం కానుంది. తక్ష ణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధించేందుకు, దీనిని నేరంగా ప రిగణించేందుకు ఉద్ధేశించిన ఆర్డినెన్స్‌కు బుధవారం కేం ద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణ యం వివరాలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ కేబినెట్ భేటీ తరువాత విలేకరులకు తెలిపారు. ట్రిపుల్ తలా క్ ఆచారం చెల్లనేరదని ఓ వై పు సుప్రీంకోర్టు స్పష్టం చేసిం ది. అయినప్పటికీ యధావిధిగా తలాక్ ఏ బిద్దత్ పద్ధతి కొనసాగుతోంది. దీనిని నివా రించేందుకు, చట్ట ప్రకారం శిక్షలు విధించేందుకు వీలుగా ఇప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయాల్సిన అవసరం ఏర్పడిందని న్యాయశాఖ మంత్రి వివరించారు. అనివార్యంగా ఈ ఆర్డినెన్స్ తీసుకువస్తున్నట్లు చెప్పారు. ప్రతిపాదిత ఆర్డినెన్స్ ప్రకారం ట్రిపుల్ తలాక్ చట్టవ్యతిరేకం అవుతుంది. చెల్లనేరదు. ట్రిపుల్ తలాక్ ఇచ్చే భర్త నేరానికి పాల్పడి వాడవుతాడు. కనీసం మూడేళ్ల జైలు శిక్షకు గురి అవుతాడు. భార్యకు భరణం కల్పిస్తారు. ప్రతిపాదిత చట్టం దుర్వినియోగానికి వీలు లేదని, ఇటువంటి భయాందోళనలు అవసరం లేదని మంత్రి తెలిపారు. ఆర్డినెన్స్‌లో పొందుపర్చిన రక్షణ చర్యల మేరకు విచారణ ప్రక్రియకు ముందు నిందితుడకి బెయిల్ పొందే అవకాశం కల్పించారు. ఆగస్టు 29న జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో చట్ట సవరణలకు ఆమోదం దక్కింది. గత ఏడాదే ఈ విధానం అక్రమం అన్యాయం అని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని, అయినా ఇప్పటికీ ట్రిపుల్ తలాక్ కొనసాగుతూ ఉండటంతో ఇప్పుడు ఆర్డినెన్స్ జారీ తప్పడం లేదని మంత్రి వెల్లడించారు. రాజ్యసభలో సంబంధిత బిల్లు పెండింగ్‌లో ఉందని, ప్రతిపక్షాలు ప్రత్యేకించి కాంగ్రెస్ దీనిని ఏదో కారణంతో వ్యతిరేకిస్తున్నాయని, వారికి ఓటు బ్యాంకు ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వైఖరి సరిగ్గా లేదని మండిపడ్డారు. బిల్లుకు మద్దతుపై సోనియాజీ మౌనం వహించారని, అయినా ట్రిపుల్ తలాక్ నిషేధ అంశంతో రాజకీయాలకు సంబంధం లేదని, ఇది పూర్తిగా లింగపరమైన న్యాయం, గౌరవానికి సంబంధించిన విషయం అని తేల్చిచెప్పారు, కనీసం వచ్చే పార్లమెంట్ సెషన్‌లో అయినా సోనియాజీ, మమతజీ, మాయావతిజీలు బిల్లుకు మద్దతు తెలియచేయాలని, లింగ సమానత కోణంలో తగు విధంగా వీరు స్పందించాల్సి ఉందని సూచించారు.
నాన్ బెయిలబుల్ నేరమే అయితే …
ప్రతిపాదించిన చట్టం పరిధిలో ట్రిపుల్ తలాక్ బెయిల్‌కు వీల్లేని నేరంగా మారుతుంది. అయితే నిందితుడు విచారణకు ముందు సంబంధిత మెజిస్ట్రేట్ నుంచి బెయిల్‌ను పొందేందుకు వీలుగా నిబంధనను రూపొందించారు. నిందితుడు ఈ బెయిల్ పొందేందుకు కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుంది. బెయిల్ దరఖాస్తు క్రమంలో ముందుగా భార్యను విచారించడం జరుగుతుంది. అంతేకాకుండా భార్యకు భరణం ఇచ్చేందుకు భర్త లిఖితపూర్వక హామీని పొందుపర్చాల్సి ఉంటుంది. ఇక ట్రిపుల్ తలాక్ కేసు దాఖలు విషయంలో నిబంధనల గురించి కూడా ఈ ఆర్డినెన్స్‌లో తెలిపారు. కేవలం బాధితురాలు ( భార్య) లేదా రక్తసంబంధీకులు, లేదా ఆమె వివాహ పంబంధిత ఆప్తులు, సన్నిహితులు దూరపు బంధువులు ట్రిపుల్ తలాక్ గురించి ఫిర్యాదు చేయవచ్చు.
శిక్షార్హం …. క్షమార్హం కూడా….
ట్రిపుల్ తలాక్ ఇకపై శిక్షార్హం అయితే, అందులో రాజీకి కూడా అవకాశం కల్పించాలరు. దీని మేరకు తన ముందుకు వచ్చే ఫిర్యాదులపై మెజిస్ట్రేట్ తగు విధంగా వ్యవహరించేందుకు, భార్యా భర్తల మధ్య తగవును తీర్చి రాజీ కల్పించేందుకు వీలేర్పడుతుంది. అయితే భార్య దీని గురించి కొంత సుముఖత వ్యక్తం చేయాల్సి ఉంటుంది. క్షమార్హ నేరం పరిధిలో ఉభయపక్షాలు కేసులను ఉపసంహరించుకునేందుకు వీలుంటుంది. ట్రిపుల్ తలాక్ లేదా తలాక్ ఏ బిద్దత్‌కు పాల్పడే వారికి ప్రతిపాదిత చట్టం వర్తిస్తుంది. దీని మేరకు బాధితులు మెజిస్ట్రేట్‌ను తమ బాధను తెలియచేసుకోవచ్చు. తనకు , మైనర్ పిల్లలకు తగు ఆర్థిక సాయం కోసం అభ్యర్థించవచ్చు. ఇక మహిళ అవసరం అనుకుంటే తన మైనర్ పిల్లల అప్పగింతకు మెజిస్ట్రేట్ నుంచి తగు ఆదేశాలను కోరవచ్చు. దీనిని పరిశీలించి న్యాయస్థానం తగు ఆదేశాలు వెలువరిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఇదిలావుండగా దేశంలో అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లకు గౌరవవేతనాన్ని రూ 3000 నుంచి రూ 4500కు పెంచే నిర్ణయానికి కూడా కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సహాయక సిబ్బందికి కూడా పెంపుదల వర్తిస్తుందని మంత్రి వివరించారు.

మోడీ రాజకీయ స్వార్థ క్రీడ: కాంగ్రెస్

ట్రిపుల్ తలా క్ అంశాన్ని మోడీ ప్రభు త్వం కేవలం రాజకీయ బంతి ఆట (ఫుట్‌బాల్) గా మల్చుకుందని కాం గ్రెస్ విమర్శించింది. మోడీ దీనిని ప్రయోజనాలకు వాడుకునే ఫుట్‌బాల్‌గా మల్చుకున్నారని, అంతేకానీ ముస్లిం మహిళలకు న్యా యం కల్పించే ఉద్ధేశం ఏ కోశానా లేదని కాంగ్రెస్  అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా బుధవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు తమ పార్టీ పలు సముచిత సవరణలు ప్రతిపాదించిందని అయితే సర్కారు వీటిని పెడచెవిని పెట్టిందని అన్నారు. బాధిత మహిళకు పరిహారం నిరాకరించే మగవాడి ఆస్తుల జప్తునకు వీలు కల్పించే నిబంధన కోసం కాంగ్రెస్ పట్టుపట్టిందని తెలిపారు. విడాకుల తరువాత భార్యను పిల్లలను దిక్కులేకుండా గాలికి వదిలేసే వారిపై తగు చర్యలకు వీలు కల్పించలేదని విమర్శించారు. తమకు సంబంధించినంత వరకూ ట్రిపుల్ తలాక్ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కూడా మానవీయ అంశం, మహిళల హక్కులు, వారికి సామాజిక న్యాయ కల్పనకు సంబంధించిన విషయం అని స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన పలువురు నేతలు లాయర్లుగా ఉండటంతో ట్రిపుల్ తలాక్ బాధిత మహిళల తరఫున కోర్టులలో వాదించారని గుర్తు చేశారు. ముస్లిం మహిళలకు సంపూర్ణ న్యాయం, సముచిత సాయం అందే పరిస్థితి కల్పించాలనే ఆలోచన మోడీకి కానీ బిజెపికి కానీ లేనేలేదని విమర్వించారు. ఇప్పుడు జరుగుతున్నదీ కేవలం రాజకీయ నాటకం అని మండిపడ్డారు.

ఇది రాజ్యాంగ వ్యతిరేకం : ఒవైసి

ట్రిపుల్ తలాక్‌పై ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతిరేకం అని మజ్లిస్ అధినేత , హైదరాబాద్ ఎంపి అసదుద్దిన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఈ ఆర్డినెన్స్‌ను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, వివిధ మహిళా సంస్థలు సుప్రీంకోర్టులో సవాలు చేస్తాయని ఒవైసీ తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ హక్కులకు విఘాతంగా ఉంది. ఈ విధమైన ఆర్డినెన్స్‌ను కేవలం ముస్లింల కోసం తీసుకురావడం సమానతకు ఉద్ధేశించిన రాజ్యాంగ హక్కుకు విరుద్ధం అని ఒ వైసీ విమర్శించారు. ట్రిపుల్ తలాక్ శిక్షార్హ నేరంగా చేయడం ముస్లిం మహిళలకు వ్యతిరేకం అని ఆయన స్పందించారు. ఇస్లాం సాంప్రదాయం ప్రకా రం వివాహం అనేది పరస్పర సివిల్ ఒప్పందం. దీనిలో జోక్యం చేసుకునే విధంగా శిక్షార్హ నిబంధనలను పొందుపర్చడం చెల్లనేరదని తెలిపారు.

మంచి పరిణామం : ఇష్రాత్ జెహాన్

ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హ నేరం చేసే ఆర్డినెన్స్ సముచితం అని, దీనిని తాము స్వాగతిస్తున్నామని పిటిషనర్ ఇష్రాత్ జెహాన్ స్పందించారు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ఆమె కోర్టును ఆశ్రయించారు. ముస్లిం మహిళా సాధికారతలో ఇది ఒక పెద్ద ముందడుగు అని జెహాన్ కోల్‌కతాలో తెలిపారు. ఈ అత్యయిక ఆదేశాలతో అయినా ముస్లిం మగవారు, మతపెద్దలు దారికొస్తారని, తమ మొండి వైఖరిని మార్చుకుంటారని ఆశిస్తున్నామన్నారు. వారి వైఖరి మారాలి లేకపోతే తగు మూల్యం చెల్లించుకునేందుకు సిద్ధపడాల్సి ఉందన్నారు. ఆర్డినెన్స్ జారీకి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాను అభినందిస్తున్నానని, ముస్లిం మహిళలకు ఇది చాలా ఉపకరిస్తుందని తెలిపారు. ఇష్రాత్ జెహాన్ ట్రిపుల్ తలాక్ బాధితురాలు. 2014లె ఆమె భర్త ఉన్నట్లుండి దుబాయ్ నుంచి ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పి, జీవిత బంధం తెంచుకునే తెగింపునకు దిగాడు. ఆమెకు 13 సంవత్సరాల కూతురు, ఏడేళ్ల కొడుకు ఉన్నారు. భర్త తలాక్ ఇవ్వడం, తన ఆలోచనలతో సంబంధం లేకుండా వ్యవహరించడం, తన పిల్లలను, తనను గాలికొదిలేవయడంతో నిరాశ్రయురాలైన జెహాన్ తనకు తగు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గత ఏడాది ఆగస్టు 22వ తేదీన సుప్రీంకోర్టు వివిధ తలాక్ వ్యతిరేక పిటిషన్ల విచారణ తరువాత ఈ పద్ధతిని రాజ్యాంగ వ్యతిరేకం అని పేర్కొంటూ కొట్టివేసింది.

Comments

comments

Related Stories: