5లక్షల మందికి జంట ఓట్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : ము సాయిదా ఓటర్ల జాబితాపై అనేక రూపాల్లో వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర సిఇఓ కార్యాల యం అధికారులు బూత్‌స్థాయి నుంచి వివరాలను సేకరించి స్పష్టమైన నోట్‌ను తయారుచేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపే పనుల్లో బిజీ అయిపోయారు. ఇప్పటివరకు చేసిన కసరత్తులో 4.91 లక్షల మంది (బుధవారం మధ్యాహ్నం సమయానికి) ఓటర్లకు రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కు వ చోట్ల ఓటు హక్కు (జాబితాలో పేర్ల న మోదు) ఉన్నట్లు తేలింది. […]

మన తెలంగాణ/హైదరాబాద్ : ము సాయిదా ఓటర్ల జాబితాపై అనేక రూపాల్లో వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర సిఇఓ కార్యాల యం అధికారులు బూత్‌స్థాయి నుంచి వివరాలను సేకరించి స్పష్టమైన నోట్‌ను తయారుచేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపే పనుల్లో బిజీ అయిపోయారు. ఇప్పటివరకు చేసిన కసరత్తులో 4.91 లక్షల మంది (బుధవారం మధ్యాహ్నం సమయానికి) ఓటర్లకు రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కు వ చోట్ల ఓటు హక్కు (జాబితాలో పేర్ల న మోదు) ఉన్నట్లు తేలింది. దేశంలోనే తొలిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ‘ఇఆర్‌ఓ నెట్’ అనే సాఫ్ట్‌వేర్ ద్వారా ఓటర్లకు ఒకటికంటే ఎక్కువ చోట్ల జాబితాలో పేరు ఉన్నట్లయితే పసిగట్టే విధానం అమలులోకి వచ్చిందని, తెలంగాణలో ఎన్నికల నిర్వహణ కూడా దీని ఆధారంగానే జరగబోతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విధానం ద్వారానే ‘ఓటర్ల డూప్లికేషన్’ అంశం వెలుగులోకి వచ్చిందని, ఒకటికంటే ఎక్కువ చోట్ల జాబితాలో పేరు ఉన్నవారి వాస్తవ వివరాలను బూత్ స్థాయి సిబ్బంది ద్వారా సేకరించి ప్రస్తుతం ఎక్కడ నివసిస్తూ ఉన్నారో అక్కడ మాత్రమే పేరు ఉంచి మరోచోట ఉన్న పేరును జాబితా నుంచి తొలగించనున్నట్లు సిఇఓ కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే కొద్దిమంది ఓటర్లకు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ద్వారానే నోటీసులను జారీ చేశామని తెలిపారు.
ఇఆర్‌ఓ నెట్ ఎలా పనిచేస్తుంది?
దేశంలో ఇంతకాలం ఎన్యుమరేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మాత్రమే ఉండేది. తొలిసారిగా హైదరాబాద్‌లోని ఇసిఐఎల్, పూణె లోని ‘సి డాక్’ల సంయుక్త ఆధ్వర్యంలో ‘ఇఆర్‌ఓ నెట్’ అనే విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. ఓటర్ల జాబితాలోని వివరాలను పేర్లు, తండ్రి/తల్లి/భర్త పేర్లు, ఇంటి నెంబరు, చిరునామా, పుట్టిన తేదీ, వయసు ఆధారంగా ఈ సాఫ్ట్‌వేర్ విశ్లేషించి ‘సారూప్యత’ కలిగిన పేర్లను తెలియజేస్తుంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల అధికారులు పరిశీలించి వారి ఫోటోలను పోలుస్తారు. ఒకవేళ వేర్వేరు ఓటర్లు అయినట్లయితే యధావిధిగా ఆ పేర్లు జాబితాలో కొనసాగుతాయి, ఒకరివే అయినట్లయితే ఆ రెండు చోట్ల ఉండే బూత్ స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి చిరునామా ఆధారంగా పరిశీలించాల్సిందిగా ఆదేశిస్తారు. ఒకవేళ ఫోటోను చూసి నిర్ధారణ చేయలేని పరిస్థితి ఉన్నట్లయితే వారి ఇండ్లకు వెళ్ళి వివరాలను మరోసారి సేకరించి జాబితాలో ఉన్న వివరాలతో పోలుస్తారు. ఈ విధంగా ఒకటికంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓటర్లను ఎన్నికల అధికారులు ఏరివేస్తారు. ఒకవేళ అలాంటి ఓటరు పేరు రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో ఉన్నట్లయితే రెండుచోట్లా ఇఆర్‌ఓ, వేర్వేరు జిల్లాల్లో ఉన్నట్లయితే జిల్లా ఎన్నికల అధికారులు, వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నట్లయితే సిఇఓలు వీటిని పరిశీలిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఆ ఓటరు చిరునామాలకు సిబ్బందిని పంపి ఎక్కడ నివసిస్తున్నారో తేలిన తర్వాత దాన్ని కొనసాగించి మరో ఎంట్రీని తొలగిస్తారు. ఒకవేళ రెండుచోట్లా నివాసం ఉంటున్నట్లు సమాధానం వచ్చినట్లయితే ఒకే రోజున ఆ ఓటరును స్వయంగా కార్యాలయానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. ఎక్కడ హాజరుకాలేకపోయారో ఆ రాష్ట్రం/జిల్లా/నియోజకవర్గంలో వారి పేర్లను తొలగిస్తారు. ఈ విధానం ద్వారా ఇప్పుడు తెలంగాణలోని 4.91 లక్షల మంది ఓటర్ల పేర్లను ఒకచోట నుంచి తొలగించనున్నారు.
జాబితా సవరణపై వార్షిక నివేదిక తుది దశకు
రాష్ట్రంలో సుమారు ముప్పై లక్షల మంది ఓటర్లను తొలగించినట్లు వస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టి వివరాలను పంపాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయాన్ని ఆదేశించడంతో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల మొదలు ఆ తర్వాత ప్రతీ ఏటా జరిగిన సవరణ ప్రక్రియ, ఓటర్ల సంఖ్యలో వచ్చిన మార్పులు చేర్పులు తదితరాలన్నింటినీ సిఇఓ కార్యాలయం తయారుచేస్తూ ఉంది. దాదాపు ఈ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర సిఇఓ కార్యాలయం చెప్తున్న వివరాల ప్రకారం 2016లోనే ఓటర్ల సంఖ్య ఇరవై లక్షలకు పైగా తగ్గగా, కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాలను పరిశీలిస్తే గతేడాదే ఒక్కసారిగా తగ్గిపోయినట్లు తేలింది.