లోపభూయిష్టంగా కమిటీలు

టిఆర్ ఎస్ లో చేరిన సురేష్‌రెడ్డికి మూడు కమిటీల్లో చోటు    కాంగ్రెస్ సీనియర్ నేతల అసంతృప్తి మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీలను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. కోర్ కమిటీ, ఎన్నికల కమిటీ, ప్రత్యేక ఆహ్వానితుల కమిటీ, ఎన్నికల మేనిఫెస్టో కమిటీ, ప్లానింగ్ స్ట్రాటజీ కమిటీ, క్రమశిక్షణా కమిటీ.. ఇలా మొత్తం తొమ్మిది కమిటీలను బుధవారం సాయంత్రం ప్రకటించారు. తొమ్మిది కమిటీల్లో కాంగ్రె స్ నాయకులందరికీ దాదాపుగా […]

టిఆర్ ఎస్ లో చేరిన సురేష్‌రెడ్డికి మూడు కమిటీల్లో చోటు   

కాంగ్రెస్ సీనియర్ నేతల అసంతృప్తి

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీలను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. కోర్ కమిటీ, ఎన్నికల కమిటీ, ప్రత్యేక ఆహ్వానితుల కమిటీ, ఎన్నికల మేనిఫెస్టో కమిటీ, ప్లానింగ్ స్ట్రాటజీ కమిటీ, క్రమశిక్షణా కమిటీ.. ఇలా మొత్తం తొమ్మిది కమిటీలను బుధవారం సాయంత్రం ప్రకటించారు. తొమ్మిది కమిటీల్లో కాంగ్రె స్ నాయకులందరికీ దాదాపుగా స్థానం కల్పించారు. కొంతమంది నేతలను దాదాపు అన్ని కమిటీల్లో చేర్చా రు. ఇటీవల టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరి న్యాయపరమైన వివాదాలను ఎదుర్కొంటున్న రేవంత్‌రెడ్డికి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యలను అప్పగించారు. 15 మంది సభ్యులతో కోర్ కమిటీ, 53 మంది సభ్యులతో కోఆర్డినేషన్ కమిటీ, 17 మంది సభ్యులతో ప్రచార కమిటీ 41 మందితో ఎన్నికల కమిటీ, 11 మందితో ప్రత్యేక ఆహ్వానితుల కమిటీ, 35 మందితో ఎన్నికల మేనిప్టెస్టో కమిటీ, 20మందితో ప్లానింగ్ స్ట్రాటజీ కమిటీ, 3 సభ్యులతో ఎల్‌డిఎంఆర్సీ కమిటీ, 7 సభ్యులతో క్రమశిక్షణ కమిటీని నియమించి ఏఐసిసి ‘చేయి’ దులుపుకుంది. ఏఐసిసి ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ కమిటీల్లో పార్టీని వీడిన వారు ఉండటం పట్ల నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. గత 10 రోజుల క్రితం కాంగ్రెస్‌ను వీడి కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ లో చేరిన శాసన సభ మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డిని కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీలో స్థానంకల్పించడంతో పాటు మేనిపెస్టో కమిటీలో కూడా చేర్చడం పట్ల కాంగ్రెస్ నాయకులు విస్మయం చెందుతున్నారు. జాతీయకాంగ్రెస్‌కు తెలంగాణ రాజకీయాల పై అవగాహన ఉందా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీలోలేనివారితో మేనిఫెస్టో ఎలా రూపొందిస్తారని ప్రశ్నిస్తున్నారు.
సీనియర్లకు దక్కని అవకాశం
తెలుగుదేసంపార్టీనుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రెవంత్ రెడ్డికి దాదాపుగా తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను మోసే వర్కింగ్ ప్రసిడెంట్ బాధ్యతలను ఏఐసిసి అప్పగించడంతో తెలంగాణ కాంగ్రెస్ లో సినియర్ల మధ్య అసమ్మతి సెగలు గక్కుతున్నది. కాంగ్రెస్ లో మొదటినుంచి ఉన్న మల్లు భట్టి విక్రమార్క ను వర్కింగ్ ప్రసిడెంట్ బాధ్యతలనుంచి తప్పించి ప్రచార బాధ్యతలకు పరిమితం చేస్తూ రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఎంతోకాలంగా ప్రజాప్రతినిధులుగా గెలుస్తూ పార్టీ అభివృద్ధికి కృషిచేస్తున్న తమనుకాదని రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రసిడెంట్ బాధ్యతలు ఎందుకు అప్పగించారో కాంగ్రెస్ తేల్చుకుంటానని ఒక సీనియర్ నాయకుడు తెప్పారు. రేవంత్ రెడ్డి కోర్టు కేసులు ఎదుర్కోవడానికే సమయం సరిపోదు ఇకపార్టీని ఎలా గెలిపిస్తారని నాయకులు ప్రశ్నిస్తున్నారు. రెవంత్ రెడ్డి కి బాధ్యతలు అప్పగించడంతో తెలంగాణ కాంగ్రెస్ లో వర్గవిభేదాలు వస్తాయని ఒకనాయకుడు ఆవేదన వ్యక్తంచేశారు. రెవంత్ రెడ్డిని దాదాపుగా ఇతర కమిటీలన్నిటిలో సభ్యుడిగా చేర్చుకోవడాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీర్ణించు కోలేక పోతున్నారు. విహెచ్‌కు ఎన్నికల కమిటీలో కేవలం సభ్యుడిగా చేర్చడాన్ని ఆయన అభమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
జైల్లో ఉన్న నాయకులకు పదవులు
మానవ అక్రమ రవాణా కేసులో జైల్లో ఉన్న మాజీ ఎంఎల్‌ఏ జగ్గారెడ్డికి కాంగ్రెస్ ప్రచార కమిటీ సభ్యునిగా ఏఐసిసి ప్రకటించడం పట్ల కాంగ్రెస్ పార్టీలో విమర్శలు వస్తున్నాయి. కేసులు ఎదుర్కొంటున్న జగ్గారెడ్డి మానవ అక్ర మ రవాణా గురించి ఎన్నికల్లో ప్రచారం చేస్తారా అని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. జైల్లో ప్రచారంచేస్తారా అని వ్యంగ్యంగా ఛలోక్తులు విసురుకుంటున్నా రు. పార్టీలో అంతర్గత వివాదాలను కొత్తకమిటీలు రచ్చకీడుస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో అనేకమంది పోటీపడగా కొత్తగా పార్టీలో చేరిన రేవంత్‌కు బాధ్యతలు అప్పగించడంతో రెడ్డి వర్గం చీలే అవకాశాలున్నట్లు పలువురు చర్చించుకోవడం కొసమెరుపు.

Comments

comments