దిగుమతి సుంకం పెంపు!

 స్టీలు ఉత్పత్తులపై 15  పన్ను  యోచన రూపాయి పతనానికి బ్రేక్ వేసేందుకు కేంద్రం చర్యలు న్యూఢిల్లీ : డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనానికి బ్రేక్ వేసేందుకు ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచాలని యోచిస్తోంది. కొన్ని స్టీలు ఉత్పత్తులపై 15 శాతం వరకు దిగుమతి సుంకం పెంచాలని కేంద్ర స్టీలు మంత్రిత్వశాఖ ప్రతిపాదించిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రూపాయి చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలో డాలర్ అవుట్‌ఫ్లోను నియంత్రించేందుకు అంతగా అవసరం లేని దిగుమతులను […]

 స్టీలు ఉత్పత్తులపై 15  పన్ను  యోచన

రూపాయి పతనానికి బ్రేక్ వేసేందుకు కేంద్రం చర్యలు

న్యూఢిల్లీ : డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనానికి బ్రేక్ వేసేందుకు ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచాలని యోచిస్తోంది. కొన్ని స్టీలు ఉత్పత్తులపై 15 శాతం వరకు దిగుమతి సుంకం పెంచాలని కేంద్ర స్టీలు మంత్రిత్వశాఖ ప్రతిపాదించిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రూపాయి చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలో డాలర్ అవుట్‌ఫ్లోను నియంత్రించేందుకు అంతగా అవసరం లేని దిగుమతులను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోందని, ఈ విషయమై బుధవారం మంత్రిత్వశాఖ చర్చించిందని అధికారులు తెలిపారు. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ‘మేక్ ఇన్ ఇండియా’ను తీసుకొస్తున్నామని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి తెలిపారు.
ఆర్‌బిఐ వద్ద తగినన్ని నిధులున్నాయ్ : నివేదిక
రూపాయి పతనానికి బ్రేక్ వేసేందుకు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వద్ద అవసరమైన మేరకు నిధులు ఉన్నాయని ఓ నివేదిక తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ), నోమురా హోల్డింగ్స్ ప్రకారం, రూపాయి పతనాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 1990 నుంచి ఆర్‌బిఐ పాటిస్తున్న విధానాల ప్రకారం చూస్తే ఫారెక్స్(విదేశీ మారక) మార్కెట్‌లో ఆర్‌బిఐ మరోసారి 25 బిలియన్ డాలర్లు విక్రయించనుందని ఎస్‌బిఐ అంచ నా వేసింది. రూపాయికి బలాన్నిచ్చేందుకు గత కొద్ది రోజులుగా ఆర్‌బిఐ డాలర్లను విక్రయిస్తూ వస్తోంది. దీంతో ఆర్‌బిఐ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. తాజాగా 400 బిలియన్ డాలర్ల దిగువకు చేరాయి. గత ఏడాదిలోనే తొలిసారి 400 బిలియ న్ డాలర్ల దిగువకు చేరడం గమనార్హం. సెప్టెంబర్ 7తో ముగిసి న వారం ఆర్‌బిఐ వద్ద గల ఫారెక్స్ నిల్వలు 819.5 మిలియన్ డాలర్లమేర క్షీణించి 399.282 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. వెరసి వరుసగా రెండో వారం ఫారెక్స్ నిల్వలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా నాలుగో నెలలోనూ ఆర్‌బిఐ నికరంగా డాలర్లను విక్రయించింది.
28 పైసలు బలపడిన దేశీయ కరెన్సీ

రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ బుధవారం 28 పైసలు కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.70 వద్ద ఉంది. మంగళవారం దేశీయ కరెన్సీ దాదాపు 73 స్థాయికి చేరువైంది. తాజాగా ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 28 పైసలు బలపడింది. మంగళవారం అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదిరిన పరిస్థితులతో స్టాక్ మార్కెట్లతోపాటు రూపాయి కూడా క్షీణించింది. గత రెండు రోజుల్లోనే రూపాయి 1 శాతం నష్టపోయింది. ముడిచమురు ధరల పెరుగుదల రూపా యి పతనానికి కారణమవుతోంది. క్రూడ్ ఆయిల్ బ్యారల్‌కు 80 డాలర్ల స్థాయిలో నిలిపేందుకు సౌదీ అరేబియా యోచిస్తున్నట్టు వార్తలు రావడం, అమెరికా ట్రెజరీ ఈల్డ్ 3 శాతాన్ని అధిగమించడం వంటి అంశాలు రూపాయిని దెబ్బతీశాయి. డాల రు మరోసారి బలపడటం వంటి అశాలు రూపాయిని దెబ్బతీస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నెల 24 నుంచి 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ 10 శాతం సుంకాలను విదించారు. దీనికి దీటుగా చైనా కూడా 67 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ ప్రొడక్టులపై 10 శాతం సుంకాలను అమలు చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో డాలర్లకు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

Comments

comments