గుజరాత్ టీ ప్రాసెసర్ నుంచి కొత్త ఉత్పత్తులు

మన తెలంగాణ / హైదరాబాద్: గుజరాత్  ప్రాసెసర్ సంస్థ నగరంలో కొత్త ఉత్పత్తులను ప్రారంభించింది. టీ పొడి తయారీలో విశేష అనుభవం ఉన్న గుజరాత్‌కు చెందిన టీ ప్రాసెసింగ్, ప్యాకర్ లిమిటెడ్ సంస్థ రకరకాల బ్రాండ్‌లతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే రీతిలో కొత్త టీ పొడి ఉత్పత్తులను మార్కెట్‌లో  ప్రవేశపెట్టింది. అన్ని రకాల బ్రాండ్ టీ పొడులను  ఆకర్షనీయమైన ప్యాకింగ్‌లో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో 50 గ్రాముల నుంచి కిలో వరకు టీ […]

మన తెలంగాణ / హైదరాబాద్: గుజరాత్  ప్రాసెసర్ సంస్థ నగరంలో కొత్త ఉత్పత్తులను ప్రారంభించింది. టీ పొడి తయారీలో విశేష అనుభవం ఉన్న గుజరాత్‌కు చెందిన టీ ప్రాసెసింగ్, ప్యాకర్ లిమిటెడ్ సంస్థ రకరకాల బ్రాండ్‌లతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే రీతిలో కొత్త టీ పొడి ఉత్పత్తులను మార్కెట్‌లో  ప్రవేశపెట్టింది. అన్ని రకాల బ్రాండ్ టీ పొడులను  ఆకర్షనీయమైన ప్యాకింగ్‌లో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో 50 గ్రాముల నుంచి కిలో వరకు టీ పొడిని మార్కెట్‌లో విక్రయానికి పెట్టారు. మిగతా టీ పొడి కంపెనీల కంటే అత్యత్తుమంగా వాఘ్ బక్రీ గోల్డ్  పేరుతో సూపర్ ప్రీమియం డస్ట్ టీని  బుధవారం  సికింద్రాబాద్‌లోని త్రీస్టార్ హోటల్‌లో ఆ సంస్థ చైర్మన్  రశేష్ దేశాయ్ ప్రారంభించారు. నగరంలో గత పది సంవత్సరాలుగా తమ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నా ప్రజలకు పూర్తిస్థాయిలో చేరువ కాలేదని ఈ కారణంగా వాఘ్ బక్రీ గోల్డ్ టీ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో  ప్రారంభించడం జరిగిందన్నారు.  దేశంలో మూడవ స్థానంలో ఉన్న తమ టీ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయన్నారు. వినియోగదారుల రుచికి అనుగుణంగా అన్ని రకాల టీ ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్‌లో ఉంచామన్నారు. వాఘ్ బక్రీ గ్రీన్ టీ, వాఘ్ బక్రీ ఐస్ టీ, అల్లం, ఇలాచి, మసాల, లెమ్‌గ్రాస్ తదితర అన్ని రకాల బ్రాండ్‌లు అందుబాటులోఉన్నాయని వినియోగదారులు తమకు అనువుగా కొనుగోలు చేయడానికి 5,10 రూపాయల ప్యాకెట్లను కూడా విడుదల చేశామన్నారు. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలలో తమ ఉత్పత్తుల వినియోగం అధికంగా ఉందని  హైదరాబాద్ నగరంలో సైతం అతి కొద్ది కాలంలోనే అన్ని రకాలైన టీ ప్రాడక్ట్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.  తమ టీ ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా కూడ కొనుగోలు చేయవచ్చన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పట్టణాలు, గ్రామాలలకు తమ టీ ఉత్పత్తులను విస్తరిస్తామని తెలిపారు. ఉత్తర భారత దేశంలో ముఖ్యంగా గుజరాత్‌లో తమ టీ పొడిని అధికంగా వాడుతారని దక్షిణ భారతదేశంలో సైతం తమ ఉత్పత్తులకు విశేష ఆదరణ లభిస్తున్నదని తెలిపారు. దేశ వ్యాప్తంగా తమ సంస్థకు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారని, పటిష్టమైన నెట్‌వర్క్ కలిగిన తమ సంస్థ  రానున్న కొద్ది కాలంలోనే  దేశంలో అగ్రస్థానంలో నిలుస్తుందని  వాఘ్ బక్రీ టీ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ లహోతి తెలిపారు. కార్యక్రమంలో ఆ సంస్థ సభ్యులు సంజయ్‌షా, పివి సురేష్, విజయ్ లోహితి పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: