ఢిల్లీ తెలివి ఇలా ఏడ్చింది!

 కాంగ్రెస్ ఎన్నికల కమిటీల్లో టిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి పేరు  ఢిల్లీలో నిర్ణయాలు జరిగితే ఇలాగే ఉంటుంది  హస్తం పార్టీ కూర్పులో తప్పులపై ఎంపి జితేందర్‌రెడ్డి వ్యాఖ్య మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని అంశాలపై జరిగే నిర్ణయాలు రాష్ట్ర స్థాయిలోనే ఉండాలని పదేపదే ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు అంటున్నారో, దాని వెనక ఉన్న ప్రాధాన్యత ఏంటో ఇ ప్పుడు కాంగ్రెస్ ఎన్నికల కమిటీల జా బితా చూస్తే అర్థమవుతుందని టిఆర్‌ఎస్ ఎంపి జితేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. […]

 కాంగ్రెస్ ఎన్నికల కమిటీల్లో టిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి పేరు
 ఢిల్లీలో నిర్ణయాలు జరిగితే ఇలాగే ఉంటుంది
 హస్తం పార్టీ కూర్పులో తప్పులపై ఎంపి జితేందర్‌రెడ్డి వ్యాఖ్య

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని అంశాలపై జరిగే నిర్ణయాలు రాష్ట్ర స్థాయిలోనే ఉండాలని పదేపదే ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు అంటున్నారో, దాని వెనక ఉన్న ప్రాధాన్యత ఏంటో ఇ ప్పుడు కాంగ్రెస్ ఎన్నికల కమిటీల జా బితా చూస్తే అర్థమవుతుందని టిఆర్‌ఎస్ ఎంపి జితేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను వీడి వారం రోజుల క్రితమే టిఆర్‌ఎస్‌లో చేరిపోయిన సురేష్‌రెడ్డి పే రును ఏకంగా మూడు కమిటీల్లో ఎఐసి సి చేర్చిందంటే రాష్ట్రంలో జరుగుతు న్న రాజకీయ పరిణామాలపై ఆ పార్టీ నేతలకు ఎంత అవగాహన ఉందో అర్థమవుతోందని ఎద్దేవాచేశారు. జైల్లో ఉన్న జగ్గారెడ్డిని ఎన్నికల క్యాంపెయిన్ కమిటీలో సభ్యుడిగా ఏఐసిసి నియమించిందని, కేసు విచారణ చేసే న్యాయస్థానం ఎప్పుడు విడుదల చేస్తుందో జగ్గారెడ్డికి కూడా తెలియదని, అయినా దీన్ని ప ట్టించుకోకుండా క్యాంపెయిన్ కమిటీ లో వేయడం ఆ పార్టీ ‘అజ్ఞానం’కు నిదర్శనమని వ్యాఖ్యానించారు. జైలు నుం చి ఆయన క్యాంపెయిన్ బాధ్యతలు చూస్తారా లేక జైల్లో ఉన్న ఖైదీలకు ప్రచారం చేస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల కమిటీ కూర్పులోనే ఇలాంటి అవకతవకలు జరిగితే ఇక పరిపాలన ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని, నాలుగున్నరేళ్ళలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అద్భుతాలు చూపించిన టిఆర్‌ఎస్‌ను ఏ స్థాయిలో ఢీకొంటుందో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలకు ఢిల్లీపై ఆధారపడితే నిర్వాకం ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల పలు సందర్భాల్లో ‘ఢిల్లీకి గులాములుగా, బానిసలుగా ఉండాలా… లేక మన రాష్ట్రంలోనే నిర్ణయాలు తీసుకుంటూ ఆత్మగౌరవంతో బతకాలా…” అంటూ తేల్చుకునే అవకాశాన్ని ప్రజలకే వదిలివేశారు. ఢిల్లీకి నిర్ణయాధికారం కట్టబెడితే దారి పర్యవసానాలు, పరిణామాలు ఎలా ఉంటాయో కాంగ్రెస్ కమిటీల కూర్పును చూస్తే ఎవరికైనా అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిటీల దగ్గరే ఇంత గందరగోళం ఉంటే ఇక అభ్యర్థుల ఎంపిక దగ్గర ఏ స్థాయిలో ఉంటుందో సులభంగా అర్థం చేసుకోవచ్చునన్నారు. ఒకవేళ ప్రజల దురదృష్టంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే అమలుచేయాల్సిన పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులపై, విధాన నిర్ణయాలపై ఢిల్లీ పార్టీ పెద్దలు ఎలాంటి పొరపాట్లకు ప్రజలు ఎంతటి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందో గ్రహించడం కష్టమేమీ కాదన్నారు. ‘మన రాష్ట్రం – మన పాలన’ అనే విధానమే ఎల్లవేళలా సురక్షితం, శ్రేయస్కరమని, కెసిఆర్ చెప్పిన ‘ఢిల్లీకి గులాములం కావద్దు’ అనే అంశాన్ని ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాన్ని కాంగ్రెస్ తాజా కమిటీల ప్రకటనతో తేటతెల్లమవుతుందని జితేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.