భారత్ బోణి…

కొలంబో: శ్రీలంకతో బుధవారం జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు 13 పరుగుల తేడా తో విజయం సాధించింది. ఈ గెలుపుతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుం ది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య లంక మహిళా జట్టు 19.3 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ […]

కొలంబో: శ్రీలంకతో బుధవారం జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు 13 పరుగుల తేడా తో విజయం సాధించింది. ఈ గెలుపుతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుం ది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య లంక మహిళా జట్టు 19.3 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన లంకకు ఓపెనర్ యశోద మెండిస్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చింది. చెలరేగి ఆడిన మెండిస్ 12 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 32 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. వన్‌డౌన్‌లో వచ్చిన హసిని పెరీరా (1) నిరాశ పరిచింది. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ ఆటపట్టు 22 బంతుల్లో వేగంగా 27 పరుగులు చేసింది. ఇందులో ఐదు ఫోర్లు ఉన్నాయి. ఇషాని కూడా భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ లంకకు అండగా నిలిచింది. ధాటిగా ఆడిన ఇషాని 31 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మరో సిక్స్‌తో 45 పరుగులు చేసింది. కానీ, మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో లంక ఇన్నింగ్స్ 155 పరుగుల వద్దే ముగిసింది. టీమిండియా బౌలర్లలో పూనమ్ యాదవ్ నాలుగు వికెట్లు తీసింది. రాధా, హర్మన్‌ప్రీత్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను వికెట్ కీపర్ తానియా ఆదుకుంది. ఓపెనర్ స్మృతి మందన ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరింది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన జమిమా రోడ్రిగ్స్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకుంది. ఆమెకు మిథాలీ అండగా నిలిచింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మిథాలీ మూడు ఫోర్లతో 17 పరుగులు చేసింది. ఇక, మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రోడ్రిగ్స్ 15 బంతుల్లోనే మూడు సిక్సర్లు, మరో 3 బౌండరీలతో 36 పరుగులు చేసింది. వికెట్ కీపర్ తానియా కూడా అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచింది. లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న తానియా ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులు సాధించింది. అంజు పాటిల్ ఐదు ఫోర్లతో 36, వేదా కృష్ణమూర్తి రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో అజేయంగా 21 పరుగులు చేసింది. దీంతో భారత్ స్కోరు 168 పరుగులకు చేరింది. కాగా, ఇంతకుముందు టీమిండియా 21తో వన్డే సిరీస్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా తొలి టి20లో గెలిచి మరోసారి పైచేయి సాధించింది.

Comments

comments