మోరాయిస్తున్న బయోమెట్రిక్ యంత్రాలు…

పెద్దపల్లి: సర్కారు బడుల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచడం కోసం విద్యాశాఖ తొలిసారి బయోమెట్రిక్ ను అమలు చేసింది. కాని ఆదిలోనే ఆగిపోయాయి. యంత్రాలు మోరయిస్తుండటంతో వేలి ముద్రల నమోదు పై ప్రభావం చూపుతుంది. చిన్న పిల్లల ఆధార్ అప్‌డేట్ లేక పోవటంతో వేలి ముద్రల నమోదులో జాప్యం జరుగుతుందిని విద్యాధికారలు చెపుతున్నారు. దీనికి తోడు గ్రామాల్లో సిగ్నల్ సరిగా లేకపోవడంతో ఆలస్యానికి కారణమవుతుంది. యంత్రాన్ని బయటకు తీసుకువచ్చిన ఫలితం కనిపించడం లేదు. ఆధునిక పద్దతులతో రూపోందించిన […]


పెద్దపల్లి: సర్కారు బడుల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచడం కోసం విద్యాశాఖ తొలిసారి బయోమెట్రిక్ ను అమలు చేసింది. కాని ఆదిలోనే ఆగిపోయాయి. యంత్రాలు మోరయిస్తుండటంతో వేలి ముద్రల నమోదు పై ప్రభావం చూపుతుంది. చిన్న పిల్లల ఆధార్ అప్‌డేట్ లేక పోవటంతో వేలి ముద్రల నమోదులో జాప్యం జరుగుతుందిని విద్యాధికారలు చెపుతున్నారు. దీనికి తోడు గ్రామాల్లో సిగ్నల్ సరిగా లేకపోవడంతో ఆలస్యానికి కారణమవుతుంది. యంత్రాన్ని బయటకు తీసుకువచ్చిన ఫలితం కనిపించడం లేదు. ఆధునిక పద్దతులతో రూపోందించిన పరికరాలు చిన్న వాటికి కూడ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సమయానికి హాజరు కాని టీచర్ల కోసం యంత్రాలు పెట్టిన ప్రయోజనం లేకుండ పోయింది. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలను తీసుకురావటం కోసం చేసిన ప్రయత్నం విఫలం కానున్నాయి. టీచర్లు సకాలంలో విధులకు హాజరు కాకపోవటంతో భోదన కుంటుపడి, ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. మధ్యాహ్న భోజనంలో విద్యార్థుల సంఖ్య సరిగా తెలుస్తాయని, బోగస్ విద్యార్థులకు కళ్లెం పడుతుందని, దీనితో ప్రజాధనం వృదా కాదని ఈ యంత్రాలను ప్రవేశపెట్టారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ఐడి ఇచ్చిన , యంత్రంలో నమోదు చేసిన ఫలితం లేకపోగా పనిచేయటం లేదు. దీనితో మూలన పడే అవకాశం ఉంది.

బయోమెట్రిక్ విధానం ప్రకారం..
ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 9.22 గంటలకు గ్రీన్ 9.22 నుంచి 9.30 వరకు ఎల్లో, 9.30 నుండి 9.36 రెడ్ జోన్ గా పరిగణిస్తారు. నిర్ణిత సమయంలో టీచర్లు, విద్యార్థులు బడికి వెళ్లి వేలి ముద్రలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆరు రెడ్ జోన్లు పూర్తి అయితే ఉపాధ్యాయునికి శ్రీముఖం జారీ చేస్తారు. ఐదు ఎల్లో ఒక రెడ్ జోన్, 3 రెడ్‌లకు ఒక సెలవు, ఆరు రెడ్ జోన్లు ఉంటే మెమో జారీ చేస్తారు.

Comments

comments