చెలరేగిన భారత బౌలర్లు….పాక్ 162 ఆలౌట్

దుబాయ్‌: ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ల దాటికి పాక్ విలవిల్లాడింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ కుమార్ పాక్ ఓపెనర్లు ఇమామ్(2), ఫకార్(0)లను పెవిలియన్ చేర్చి పాక్ నడ్డి విరిచాడు. ఈ దశలో పాకిస్థాన్‌కు షోయబ్ మలిక్, బాబర్ ఆజామ్‌లు అండగా నిలిచారు. మూడో వికెట్‌కి 82 పరుగులు భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ఈ జోడీకి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో […]

దుబాయ్‌: ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ల దాటికి పాక్ విలవిల్లాడింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ కుమార్ పాక్ ఓపెనర్లు ఇమామ్(2), ఫకార్(0)లను పెవిలియన్ చేర్చి పాక్ నడ్డి విరిచాడు. ఈ దశలో పాకిస్థాన్‌కు షోయబ్ మలిక్, బాబర్ ఆజామ్‌లు అండగా నిలిచారు. మూడో వికెట్‌కి 82 పరుగులు భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ఈ జోడీకి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో బ్రేక్ పడింది. యాదవ్ వేసిన 22వ ఓవర్ తొలి బంతికి బాబర్(47) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(6) భారీ షాట్‌కు ప్రయత్నించి మనీశ్ పాండేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఇక నిలకడగా ఆడుతున్న షోయబ్ మలిక్(43) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన అసిఫ్ అలీ(9) జాదవ్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు.మిగతావారు పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీంతో పాక్  43.1 ఓవర్లకు 162 పరుగులకు ఆలౌటైంది.  కేదార్‌ జాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ తలో 3 వికెట్లు తీయగా బుమ్రా 2 వికెట్లు తీశాడు.

Comments

comments