టి-కాంగ్రెస్‌లో పలు మార్పులు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. కాగా, పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పలు మార్పులు చేశారు. టిపిసిసికి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 9 అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు 15 మందితో కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డికి ప్రమోషన్ లభించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు నియమితులు కావడం విశేషం. ఇక ప్రచార కమిటీ ఛైర్మన్ గా […]

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. కాగా, పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పలు మార్పులు చేశారు. టిపిసిసికి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 9 అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు 15 మందితో కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డికి ప్రమోషన్ లభించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు నియమితులు కావడం విశేషం. ఇక ప్రచార కమిటీ ఛైర్మన్ గా మల్లు భట్టి విక్రమార్క, కో-ఛైర్మన్ గా డికె అరుణ, కన్వీనర్ గా దాసోజు శ్రవణ్ లను రాహుల్ నియమించారు. 41 మందితో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసి, 53 మందితో కోఆర్డినేషన్ కమిటీని నియమించారు. 17 మందితో ప్రచార కమిటీ, 35 మందితో మేనిఫెస్టో కమిటీ, 20 మందితో స్ట్రాటజీ కమిటీని ఏర్పాటు చేశారు. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా దామోదర రాజనర్సింహను నియమించారు. స్ట్రాటజీ కమిటీ ఛైర్మన్ గా వి.హనుమంతరావు నియమితులయ్యారు. ఇసి సమన్వయ కమిటీ ఛైర్మన్ గా మర్రి శశిధర్ రెడ్డిని, పార్టీ క్రమశిక్షణ చర్యల కమిటీ ఛైర్మన్ గా కోదండరెడ్డిని పార్టీ చీఫ్ నియమించారు.

Related Stories: