భార్య ఫిర్యాదుతో ఇద్దరూ ఆత్మహత్య…

పెనుబల్లి : ఆంధ్ర ప్రాతానికి చెందిన ఓ యువతి, యువకుడు (వివాహితుడు) ఇద్దరు కలసి పెనుబల్లి మండల పరిధలోని నీలాద్రి గుట్టల వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే ఆంద్ర ప్రదేశ్ కృష్ణా జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామానికి చెందిన జొన్నలగడ్డ తిరుపతి రావు (25) అనే వివాహితుడు అదే గ్రామానికి చెందిన కొంగల లక్ష్మి(19) అనే జంట బుదవారం పెనుబల్లి మండల పరిధిలోని నీలాద్రి గుట్టల […]

పెనుబల్లి : ఆంధ్ర ప్రాతానికి చెందిన ఓ యువతి, యువకుడు (వివాహితుడు) ఇద్దరు కలసి పెనుబల్లి మండల పరిధలోని నీలాద్రి గుట్టల వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే ఆంద్ర ప్రదేశ్ కృష్ణా జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామానికి చెందిన జొన్నలగడ్డ తిరుపతి రావు (25) అనే వివాహితుడు అదే గ్రామానికి చెందిన కొంగల లక్ష్మి(19) అనే జంట బుదవారం పెనుబల్లి మండల పరిధిలోని నీలాద్రి గుట్టల వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడుకి గతంలో దీప్తి అనే యువతితో వివాహం అయి ఓ బాలిక ఉంది. ఇదిలా ఉండగా మృతురాలితో ప్రేమలో పడి గత నాలుగు రోజులుగా కుటుంబ సభ్యులకు కనపడకుండా తిరుతున్నారు. మరో యువతితో సంబందం పెట్టుకున్న విషయం తెలిసి భార్య దీప్తి తిరువూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా బుధవారం విచారణ కొరకు సమాచారం రావటం పెద్దల పంచాయితీ ఏర్పాటు చేయటంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలింది. సత్తుపల్లి రూరల్ సిఐ మడత రమేష్ సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. మృత దేహాల పంచనామా నిమిత్త పెనుబల్లి ఏరియా దవాఖానకు తరలించారు. వియంబంజర యస్‌ఐ టి నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Stories: