ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయం…

దుబాయ్:  వేదికగా జరుగుతున్న ఆసియాకప్‌ టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఐదో మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. 18వ ఓవర్‌లో బౌలింగ్ వేస్తున్న పాండ్యా కిందపడ్డాడు. కాగా, బంతిని వేసిన అనంతరం కుడి కాలును నేలపై సరిగా వేయడంలో ఆయన తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. కిందపడ్డ తరువాతం పాండ్యా కిందనుంచి లేవలేకపోయాడు. దీంతో స్ట్రెచర్ తీసుకువచ్చి పాండ్యాను […]

దుబాయ్:  వేదికగా జరుగుతున్న ఆసియాకప్‌ టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఐదో మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. 18వ ఓవర్‌లో బౌలింగ్ వేస్తున్న పాండ్యా కిందపడ్డాడు. కాగా, బంతిని వేసిన అనంతరం కుడి కాలును నేలపై సరిగా వేయడంలో ఆయన తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. కిందపడ్డ తరువాతం పాండ్యా కిందనుంచి లేవలేకపోయాడు. దీంతో స్ట్రెచర్ తీసుకువచ్చి పాండ్యాను వైద్య సేవల నిమిత్తం బయటకు తీసుకువెళ్లారు. పాండ్యా ఓవర్‌లోని చివరి బంతిని అంబటి రాయుడు వేశాడు. దుబాయ్‌లో ఎండ తీవ్రత కూడా బాగా ఉంది. దీంతో ప్లేయర్లు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. పాండ్యాకు తీవ్ర‌మైన వెన్ను నొప్పి వ‌చ్చిన‌ట్టు సమాచారం. ప్ర‌స్తుతం అత‌ను లేచి నిల‌బ‌డుతున్నాడ‌ని వైద్యులు వెల్లడించారు.