ఆన్‌లైన్ మోసాలు…ముగ్గురు అరెస్ట్

గచ్చిబౌలి : ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 10ల్యాప్‌టాప్‌లు 40వేల నగదు స్వాధీనం చేసుకున్న సంఘటన  బుదవారం చోటు చేసుకుంది. మాదాపూర్ డిసిపి తెలిపిన వివరాల ప్రకారం… మహరాష్ట్రకు చెందిన షాహనుర్ శంసుద్దీన్ అలియాస్ మహమ్మద్ ఆయన్ (35), మహమ్మద్ అక్బర్ (36), మహమ్మద్ జీషాన్ సిద్ధికి (24,) ఈ ముగ్గురు కలిసి 7 ఎలెవన్ వరల్డ్ గ్రూప్ అనే నకిలీ కార్యలయాన్ని ఖాజాగూడలో ఏర్పాటు చేసి […]

గచ్చిబౌలి : ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 10ల్యాప్‌టాప్‌లు 40వేల నగదు స్వాధీనం చేసుకున్న సంఘటన  బుదవారం చోటు చేసుకుంది. మాదాపూర్ డిసిపి తెలిపిన వివరాల ప్రకారం… మహరాష్ట్రకు చెందిన షాహనుర్ శంసుద్దీన్ అలియాస్ మహమ్మద్ ఆయన్ (35), మహమ్మద్ అక్బర్ (36), మహమ్మద్ జీషాన్ సిద్ధికి (24,) ఈ ముగ్గురు కలిసి 7 ఎలెవన్ వరల్డ్ గ్రూప్ అనే నకిలీ కార్యలయాన్ని ఖాజాగూడలో ఏర్పాటు చేసి నిరుద్యోగ యువత, క్యాబ్ డ్రైవర్‌లను లక్ష్యంగా చేసుకోని తమ సంస్థ ద్వారా క్యాబ్ పెట్టినట్లయితే రోజుకు 2వేల రూపాయాలు ఇస్తామని ఆశ చూపి మిగత కంపెనీ క్యాబ్ రేట్లకి వీరిచ్చే కంపెనీ పర్సంటేజికి ఆశపడి క్యాబ్ డ్రైవర్లు కంపెనీ రిజిస్టేషన్ ఫీజు ఒక్కోక్కరి వద్ద 2 వేల రూపాయలు వసులు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయిన సదరు ఆఫీసు నుండి బుకింగ్స్ రాకపోవడంతో క్యాబ్ డ్రైవర్లకు అనుమానం వచ్చి రాయదుర్గం పోలీసులను ఆశ్రయించగా పోలీసులు వారిని పకట్‌బంధీ వ్యుహంతో అరెస్ట్ చేసి విచారించగా శంశుద్ధీన్ చేస్తున్న మోసాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వచ్చాయని తెలిపారు. రాయద్గుం జేఆర్‌సీ కన్వేషన్ సెంటర్‌లో అరేబియన్ నైట్ పేరుతో మరో మోసానికి తెరలేపాడని తెలిపారు. ఆన్‌లైన్లో వివిధ ఆహరపదార్థాల బుకింగ్ నిమిత్తం 5 వేల రూపాయల వసూలుకు యత్నించినట్టు తెలిపారు. మహరాష్ట్ర, బెంగళూరు తధితర ప్రాంతాలలో ఇదే తరహ మోసాలకు పాల్పడినట్టు విచారణలో తెలిందన్నారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం ఇన్స్‌పెక్టర్ రాంబాబు, ఎస్‌ఐలు శశిధర్ తదితరులు పాల్గోన్నారు.

Comments

comments