జియో ఫోన్‌ లో ఇక యూట్యూబ్…

ముంబయి: జియో ఫోన్ యూజర్లకు మరో శుభవార్త వినిపించింది. కొన్ని రోజుల కిందటే జియో ఫోన్‌కు  వాట్సాప్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఈ ఫోన్‌కు యూట్యూబ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది జియో. ఈ ఫోన్‌లో ఉన్న జియో స్టోర్‌లో యూట్యూబ్ యాప్‌ను యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని జియో తెలిపింది. జియో ఫోన్‌తోపాటు జియోఫోన్ 2 లోనూ ఈ యాప్ అందుబాటులో ఉంది. జియోలో ఉన్న కైఒఎస్‌ను ఆధారంగా చేసుకుని యూట్యూబ్ యాప్‌ను అందుకు […]

ముంబయి: జియో ఫోన్ యూజర్లకు మరో శుభవార్త వినిపించింది. కొన్ని రోజుల కిందటే జియో ఫోన్‌కు  వాట్సాప్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఈ ఫోన్‌కు యూట్యూబ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది జియో. ఈ ఫోన్‌లో ఉన్న జియో స్టోర్‌లో యూట్యూబ్ యాప్‌ను యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని జియో తెలిపింది. జియో ఫోన్‌తోపాటు జియోఫోన్ 2 లోనూ ఈ యాప్ అందుబాటులో ఉంది. జియోలో ఉన్న కైఒఎస్‌ను ఆధారంగా చేసుకుని యూట్యూబ్ యాప్‌ను అందుకు అనుగుణంగా గూగుల్ డెవలప్ చేసినట్టు సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే జియో ఫోన్ హార్డ్‌వేర్‌కు అనుగుణంగా యూట్యూబ్ ఉత్తమమైన ప్రదర్శనను ఇస్తుందని సంస్థ చెప్పుకొచ్చింది. అయితే, జియోఫోన్‌లో ఇప్పటికే ఫేస్‌బుక్ లభిస్తుండగా, ఆ యాప్‌కు మరిన్నిహంగులు చేర్చి నూతనంగా ఫేస్‌బుక్‌ను జియో ఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

Comments

comments

Related Stories: