నవదంపతులపై దాడి చేసిన అమ్మాయి తండ్రి

హైదరాబాద్: నవదంపతులపై కన్నతండ్రి కత్తితో దాడి చేసిన దారుణ ఘటన ఎర్రగడ్డలోని చోటుచేసుకుంది. మాట్లాడుదామని పిలిచి కత్తితో దాడి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో దంపతులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తక్షణమే అప్రత్తమైన స్థానికులు వారిని సమీపంలోని నీలిమా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడిచారు. ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ కు చెందిన సందీఫ్ (24), బోరబండ వినాయక్ రావు నగర్ కు చెందిన మాధవి (22) గత 5 సంవత్సరాలుగా […]

హైదరాబాద్: నవదంపతులపై కన్నతండ్రి కత్తితో దాడి చేసిన దారుణ ఘటన ఎర్రగడ్డలోని చోటుచేసుకుంది. మాట్లాడుదామని పిలిచి కత్తితో దాడి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో దంపతులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తక్షణమే అప్రత్తమైన స్థానికులు వారిని సమీపంలోని నీలిమా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడిచారు. ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ కు చెందిన సందీఫ్ (24), బోరబండ వినాయక్ రావు నగర్ కు చెందిన మాధవి (22) గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరుకావడంతో యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. కాగా, పదిరోజుల కిందట వీరు అల్వాల్ లోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు ముందు వ్యతిరేకించినా తర్వాత ఒప్పుకున్నారు. దీంతో ఇరు కుటుంబాలు కలిసిపోయాయి. అప్పటి నుంచి మాధవి తన భర్తతో అత్తగారింట్లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే మాధవి తండ్రి రెండు రోజులుగా తనను కలుస్తూ ఆమెతో ప్రేమగా ఉంటున్నట్టు నటించాడు. బుధవారం నవదంపతులు సందీప్, మాధవిలకు బట్టలు కొనిస్తానని చెప్పి ఎర్రగడ్డలోని హోండా షోరూం దగ్గరకు పిలిచాడు. ముందుకు వేసుకున్న పథకం ప్రకారం అక్కడికి వచ్చిన ఇద్దరిపై స్థానికులు చూస్తుండానే దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments