ఇప్పటికీ నాకు ఒక సందేహం: బాలస్వామి

నల్గొండ: సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య పూర్వాపరాలను నల్లగొండ ఎస్‌పి ఎం.వి.రంగనాథ్ మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ హత్య కేసు విషయమై ప్రణయ్ తండ్రి బాలస్వామి ఓ టివి చానెల్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రణయ్‌ హత్య కేసులో పోలీసులపై నాకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. పోలీసులు మీడియా ముందు అన్ని విషయాలు చెప్పారు. కానీ, నాకు ఇప్పటికీ ఒక సందేహం ఉంది. ప్రణయ్ పై దాడి చేసిన […]

నల్గొండ: సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య పూర్వాపరాలను నల్లగొండ ఎస్‌పి ఎం.వి.రంగనాథ్ మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ హత్య కేసు విషయమై ప్రణయ్ తండ్రి బాలస్వామి ఓ టివి చానెల్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రణయ్‌ హత్య కేసులో పోలీసులపై నాకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. పోలీసులు మీడియా ముందు అన్ని విషయాలు చెప్పారు. కానీ, నాకు ఇప్పటికీ ఒక సందేహం ఉంది. ప్రణయ్ పై దాడి చేసిన కత్తిపై ఉన్న వేలిముద్రలు, బీహార్‌లో పట్టుబడిన హంతకుడు శర్మ వేలిముద్రలు ఒకటా కాదా అనేది తనకు సందేహంగా ఉందన్నారు. ఈ విషయాన్ని ఎస్‌పి ఎం.వి.రంగనాథ్ చెప్పలేదని, ఒకవేళ వేలిముద్రలు ధ్రువీకరణ కాకపోతే హంతకుడు తప్పించుకునే అవకాశం ఉందని చెప్పారు. హంతకుడు డబ్బున్న వాడు కావున అతడు చేసిన పనికి ఉరిశిక్ష పడితేనే మేం సంతోషిస్తామని బాలస్వామి చెప్పుకొచ్చారు. మారుతీరావు బయటకు వస్తే మళ్లీ ఇలాంటి హత్యలే చేస్తాడని భయమేస్తోందని, ఆయనతో పాటు శర్మకు ఉరిశిక్ష పడేలా ప్రజాసంఘాలు, పార్టీలు, పోలీసులు ఒత్తిడి చేయాలని తెలిపారు. మా కొడుకును చంపిన వాడు రేపు మమ్ముల్ని చంపడని గ్యారెంటీ ఏముందని, కొడలు అమృతను అపహరించి మానుంచి దూరం చేసే ప్రమాదం కూడా ఉందన్నారు. అందుకే నిందితులపై పిడియాక్ట్‌ పెట్టి, కొత్త చట్టాలతో కారాగారం నుంచి బయటకు రాకుండా చూడాలని బాలస్వామి కోరారు.

Comments

comments