అరణ్యంలో సంగీత కచేరీ!

సంగీతాన్ని ఇష్టపడని వారు ప్రపంచంలో ఎవరూ ఉండరు. సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయంటారు. మ్యూజిక్ జంతువులను కూడా మైమర పిస్తుందనేది థాయ్‌లాండ్‌లోని ఏనుగులను చూస్తే తెలుస్తోంది. అంధురాలైన ప్లారా అనే ఏనుగు తిండి కోసం అడవుల్లో తిరుగుతూ పాపం చాలా అవస్థలు పడుతుండేది. అయితే ఒకసారి దానికి పియానో శబ్దం వినిపించింది. తినడం ఆపేసి ఆ వైపుగా వెళ్లింది. అంతే ఇక అప్పటి నుండి సంగీతం విననిదే తిండి ముట్టని స్థాయికి వెళ్లింది. ఇంతకీ ఆ కీకారణ్యంలో […]

సంగీతాన్ని ఇష్టపడని వారు ప్రపంచంలో ఎవరూ ఉండరు. సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయంటారు. మ్యూజిక్ జంతువులను కూడా మైమర పిస్తుందనేది థాయ్‌లాండ్‌లోని ఏనుగులను చూస్తే తెలుస్తోంది. అంధురాలైన ప్లారా అనే ఏనుగు తిండి కోసం అడవుల్లో తిరుగుతూ పాపం చాలా అవస్థలు పడుతుండేది. అయితే ఒకసారి దానికి పియానో శబ్దం వినిపించింది. తినడం ఆపేసి ఆ వైపుగా వెళ్లింది. అంతే ఇక అప్పటి నుండి సంగీతం విననిదే తిండి ముట్టని స్థాయికి వెళ్లింది. ఇంతకీ ఆ కీకారణ్యంలో పియానో వాయించేది ఎవరనేగా మీ డౌట్..

అతని పేరు పాల్ బార్టన్, జంతు ప్రేమికుడు. స్వచ్ఛందంగా అడవిలో తప్పిపోయిన జంతువులు, గాయాలకు గురైనవి, వృద్ధ జంతువులన్నింటికి స్వాంతన కలిగించాలనుకున్నాడు. అంతే అడవిలోనే పియానోతో మకాం మార్చాడు. అతని సంగీతానికి ప్లారా అలవాటు పడింది. అది ఆహారాన్ని తినడం మానేసి రావడం చూసిన బార్టన్, అందుక్కూడా ఓ ఏర్పాటు చేశాడు. పియానో దగ్గరే దానికి కావలసిన గడ్డి, నీళ్లు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు పియానో వినడానికి ప్లారాతోపాటు చాలా ఏనుగులు వస్తున్నాయి. ప్రతి ఏనుగుతో అతనికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, నెటిజన్లు బార్టన్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Telangana news

Elephants Listen Music

Comments

comments