ట్రిపుల్ తలాక్ పై కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ఢిల్లీ:  ట్రిపుల్ తలాక్ వ్యవహారంపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకరానుంది. ముస్లిం మహిళల రక్షణ కోసం తీసుకువస్తున్న  ట్రిపుల్ తలాక్ అంశంపై ఆర్డినెన్స్‌కు కేంద్రం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ట్రిపుల్ తలాక్‌ను పూర్తిస్థాయిలో రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్టు సమాచారం. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తకు మూడేళ్ల జైలు శిక్షను కేంద్రం ప్రతిపాదించనుంది. ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది.. కానీ రాజ్యసభలో ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన వెంటనే బిల్లు ఆమోదానికి కేంద్రం […]


ఢిల్లీ:  ట్రిపుల్ తలాక్ వ్యవహారంపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకరానుంది. ముస్లిం మహిళల రక్షణ కోసం తీసుకువస్తున్న  ట్రిపుల్ తలాక్ అంశంపై ఆర్డినెన్స్‌కు కేంద్రం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ట్రిపుల్ తలాక్‌ను పూర్తిస్థాయిలో రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్టు సమాచారం. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తకు మూడేళ్ల జైలు శిక్షను కేంద్రం ప్రతిపాదించనుంది. ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది.. కానీ రాజ్యసభలో ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన వెంటనే బిల్లు ఆమోదానికి కేంద్రం చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.  ముస్లిం సమాజంలో ఆచరణీయంగా ఉన్న ముమ్మారు తలాక్ ఉచ్ఛారణతో భార్యకు విడాకులిచ్చే (తలాక్ ఇ బిద్దత్) దుస్సాంప్రదాయానికి ఒడిగట్టే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే బిల్లును భిన్నాభిప్రాయాల మధ్య మూజువాణి ఓటుతో లోక్‌సభలో ఆమోదించిన విషయం తెలిసిందే. ట్రిపుల్ తలాక్ అమానుషం, రాజ్యాంగ విరుద్ధం, చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇవ్వటం జరిగింది. ఇది తమ వ్యక్తిగత చట్టంలో జోక్యంగా కొందరు వాదించినప్పటికీ లింగ సమానత్వానికి సుప్రీంకోర్టు ప్రాధాన్యత ఇచ్చింది. ఆ తీర్పుకు చట్టపరమైన అండ కల్పించేందుకు ఈ ముస్లిం మహిళల (వివాహితుల హక్కుల రక్షణ) బిల్లు, 2017ను తెచ్చినట్లు ప్రభుత్వం చెప్పింది. “ఒక వ్యక్తి తన భార్యపై పదాల ఉచ్ఛారణ ద్వారా లేక లిఖితపూర్వకంగా లేక ఎలక్ట్రానిక్ రూపంలో లేక మరే ఇతర రూపంలోనైనా తలాక్‌ను ప్రయోగించటం చెల్లనేరదు, చట్ట విరుద్ధం” అని బిల్లు పేర్కొన్నది.

Related Stories: