టిడిపి, కాంగ్రెస్ పొత్తు అనైతికం: కవిత

హైదరాబాద్: మహాకూటమి ఒక దుష్ట చతుష్టయమని ఎంపి కవిత ఎద్దేవా చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మీద ప్రేమలేని పార్టీలు కూటమిగా వస్తున్నాయని మండిపడ్డారు. టిడిపి, కాంగ్రెస్ పొత్తు అనైతికమని ధ్వజమెత్తారు. టిడిపి, కాంగ్రెస్‌లు తెలంగాణను పీడించాయని నిప్పులు చెరిగారు. తెలంగాణను పీడించిన పార్టీలతో కోదండరామ్ జట్టుకట్టడం హాస్యాస్పదంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మహాకూటమి కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఓట్ల గల్లంతు విషయంలో టిఆర్ఎస్ పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం […]

హైదరాబాద్: మహాకూటమి ఒక దుష్ట చతుష్టయమని ఎంపి కవిత ఎద్దేవా చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మీద ప్రేమలేని పార్టీలు కూటమిగా వస్తున్నాయని మండిపడ్డారు. టిడిపి, కాంగ్రెస్ పొత్తు అనైతికమని ధ్వజమెత్తారు. టిడిపి, కాంగ్రెస్‌లు తెలంగాణను పీడించాయని నిప్పులు చెరిగారు. తెలంగాణను పీడించిన పార్టీలతో కోదండరామ్ జట్టుకట్టడం హాస్యాస్పదంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మహాకూటమి కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఓట్ల గల్లంతు విషయంలో టిఆర్ఎస్ పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఓట్ల వ్యవహారం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుందన్నారు. కోర్టులకు వెళ్లడం, చివాట్లు తినడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.

MP Kavitha Comments on TDP, Congress Alliance

Telangana news

Comments

comments