ప్ర‌ణ‌య్ హ‌త్య‌పై స్పందించిన చెర్రీ

హైదరాబాద్: పట్టపగలు అందరూ చూస్తుండగానే నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో దుండగులు పెరుమాళ్ళ ప్రణయ్(25) అనే యువకుడిని అత్యంత కిరాతకంగా నరికి చంపేసిన సంగతి తెలిసిందే. ఈ హ‌త్య రాష్ట్రవ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తన కూతురు తక్కువ కులం యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆమె తండ్రి అత్యంత కిరాకతకంగా కిరాయి హంత‌కుడితో ప్ర‌ణ‌య్‌ని చంపిచడంపై రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినిమా సెల‌బ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఈ పరువు హత్యపై ఇప్ప‌టికే రామ్, మంచు మనోజ్‌, గాయని చిన్మయి త‌దిత‌రులు సోషల్ […]

హైదరాబాద్: పట్టపగలు అందరూ చూస్తుండగానే నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో దుండగులు పెరుమాళ్ళ ప్రణయ్(25) అనే యువకుడిని అత్యంత కిరాతకంగా నరికి చంపేసిన సంగతి తెలిసిందే. ఈ హ‌త్య రాష్ట్రవ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తన కూతురు తక్కువ కులం యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆమె తండ్రి అత్యంత కిరాకతకంగా కిరాయి హంత‌కుడితో ప్ర‌ణ‌య్‌ని చంపిచడంపై రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినిమా సెల‌బ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఈ పరువు హత్యపై ఇప్ప‌టికే రామ్, మంచు మనోజ్‌, గాయని చిన్మయి త‌దిత‌రులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాజాగా మెగాపవర్ స్టార్ రాంచ‌ర‌ణ్ దీనిపై తన అభిప్రాయాన్ని తెలిపారు. త‌న ఫేస్‌బుక్ పేజీలో ప్రణయ్ హ‌త్య‌పై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప‌రువు హ‌త్య తనను తీవ్రంగా క‌లచి వేసిందని ఆయన చెప్పుకొచ్చారు. వ్య‌క్తి ప్రాణం తీసే ప‌రువు ఎక్క‌డ ఉందని చెర్రీ ప్రశ్నించారు. అస‌లు మ‌న స‌మాజం ఎక్క‌డికి వెళ్తుందో అర్థం కావడం లేదన్నారు. బాధితురాలు అమృతకి నా సానుభూతి, మృతుడు ప్ర‌ణ‌య్ ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నాను అని చ‌ర‌ణ్ పేర్కొన్నారు. అలాగే ప్రణయ్‌కు న్యాయం జరగాలి (#justiceforpranay),  ప్రేమకు హద్దులు లేవు (#Lovehasnoboundaries) అనే ట్యాగ్‌లను కూడా చరణ్ జత చేశారు. ఇక భర్త రాంచరణ్ పోస్టుపై ఉపాసన కూడా స్పందించారు. ‘సాడ్ టైమ్స్.. వెర్ వి ఆర్ గోయింగ్’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చెర్రీ ఫేస్‌బుక్ పోస్టును స్క్రీన్ షాట్ తీసి ఆమె ట్వీట్ చేశారు.

Comments

comments