దాయాదుల పోరుకు పాక్ ప్రధాని

దుబాయి: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులు పాకిస్థాన్, భారత్ జట్ల మధ్య బుధవారం పోరు జరుగనుంది. ఆసియాకప్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. అయితే, ఈ మ్యాచ్‌ను చూసేందుకు పాకిస్థాన్ నూత‌న ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ రానున్నారని సమాచారం. తొలి విదేశాంగ పర్యటనలో భాగంగా రెండు రోజులపాటు ఇమ్రాన్ సౌదీ, యుఎఇలో పర్యటించనున్నారు. దీంతో ఇవాళ్టి దుబాయిలో జరిగే దాయాదుల […]

దుబాయి: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులు పాకిస్థాన్, భారత్ జట్ల మధ్య బుధవారం పోరు జరుగనుంది. ఆసియాకప్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. అయితే, ఈ మ్యాచ్‌ను చూసేందుకు పాకిస్థాన్ నూత‌న ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ రానున్నారని సమాచారం. తొలి విదేశాంగ పర్యటనలో భాగంగా రెండు రోజులపాటు ఇమ్రాన్ సౌదీ, యుఎఇలో పర్యటించనున్నారు. దీంతో ఇవాళ్టి దుబాయిలో జరిగే దాయాదుల పోరుకు ఆయన హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పాక్ కు చెందిన ఓ టీవీ చానెల్ ధ్రువీకరిస్తూ కథనం ప్రసారం చేసినట్లు తెలిసింది. ఇక యుఎఇలో 2006 తర్వాత తొలిసారి దాయాదులు భారత్, పాక్ తలపడబోతున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో టీమిండియాకు షాకిచ్చి పాక్ టైటిల్ ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. అంతేగాక ప్రస్తుతం పాక్ ఆటగాళ్లు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. అలాగే రోహిత్ సేన సైతం అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో పటిష్టంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో దాయాదుల మధ్య గట్టిపోటీ ఉండనుంది.

Comments

comments