కేజ్రీవాల్, సిసోడియాకు కోర్టు సమన్లు

న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సిఎం మణీష్ సిసోడియా, 11 మంది ఆప్ ఎంఎల్‌ఎలకు ఢిల్లీకోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న రాత్రి కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశ సందర్భంగా ప్రకాష్‌పై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 13న ఢిల్లీ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయడంతో దానిపై విచారణ జరిపిన అనంతరం అదనపు […]

న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సిఎం మణీష్ సిసోడియా, 11 మంది ఆప్ ఎంఎల్‌ఎలకు ఢిల్లీకోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న రాత్రి కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశ సందర్భంగా ప్రకాష్‌పై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 13న ఢిల్లీ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయడంతో దానిపై విచారణ జరిపిన అనంతరం అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ సమన్లు జారీ చేశారు. కేసులో నిందితులందరికీ సమన్లు ఇచ్చిన కోర్టు అక్టోబర్ 25న హాజరు కావాలని ఆదేశించింది. నిందితులుగా కేజ్రీవాల్, సిసోడియాతో పాటు మరో 11 మంది ఆప్ ఎంఎల్‌ఎలు అమానుతుల్లా ఖాన్, ప్రకాశ్ జర్వాల్, నితిన్ త్యాగి, రితురాజ్ గోవింద్, సం జీవ్ ఝా, అజయ్ దత్, రాజేష్ రిషి, రాజేష్ గు ప్తా, మదన్ లాల్, ప్రవీణ్ కుమార్, దినేష్ మొహనియలు ఉన్నారు. ఈ కేసులో ఛార్జిషీట్‌కు సం బంధించిన సమాచారాన్ని మీడియా ద్వారా పం చుకోకూడదని పోలీసులను ఆదేశించాలని కేంజ్రీవాల్, డిప్యూటీ సిఎం, ఇతర ఎంఎల్‌ఎలు దాఖ లు చేసిన పిటిషన్‌పై విచారణను తిరస్కరిస్తూ ఆగస్టు 25న కోర్టు ఉత్తర్వును రిజర్వ్ చేసింది.

Related Stories: