ఏడేళ్ల బాలికపై అత్యాచారం

 పొరుగింటి చిన్నారిపై యువకుడి లైంగిక దాడి న్యూఢిల్లీ: ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసినఆరోపణపై 21 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నగరంలో షాదరలోని సీమ పురిలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగిందని వారు చెప్పారు. తమ పొరుగింటి వ్యక్తి తన కూతురిపై అత్యాచారం చేశాడని బాధితురాలి తల్లి ఆరోపించింది. సోమవారం రాత్రి దాదాపు పదిన్నర ప్రాం తంలో ఆ అమ్మాయి ఇంటి బయట ఆడుకుంటూ ఉంది. ఆ సమయంలో నిందితుడు బాలికను డిఎల్‌ఎఫ్ […]

 పొరుగింటి చిన్నారిపై యువకుడి లైంగిక దాడి


న్యూఢిల్లీ: ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసినఆరోపణపై 21 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నగరంలో షాదరలోని సీమ పురిలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగిందని వారు చెప్పారు. తమ పొరుగింటి వ్యక్తి తన కూతురిపై అత్యాచారం చేశాడని బాధితురాలి తల్లి ఆరోపించింది. సోమవారం రాత్రి దాదాపు పదిన్నర ప్రాం తంలో ఆ అమ్మాయి ఇంటి బయట ఆడుకుంటూ ఉంది. ఆ సమయంలో నిందితుడు బాలికను డిఎల్‌ఎఫ్ చౌక్ సమీపంలో ఉన్న పొదలచాటుకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఇంటికి వెళ్లిన తర్వాత బాలికకు రక్తస్రావమైంది. తల్లికి అనుమానం వచ్చి అడగడంతో ఆ చిన్నారి జరిగిన సంగతి చెప్పింది. బాధితురాలి తల్లి చేసిన ఫిర్యాదు మేరకు సీమపురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. లైంగిక దాడుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం కింద ఈ కేసు నమోదు చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ (డిసిడబ్లూ) ఛైర్‌పర్షన్ స్వాతి మాలివాల్ ఈ సంఘటనపై ట్వీట్ చేశారు. నిందితుడు ఆ బాలికను ఒక పార్క్‌లోకి తీసుకెళ్లి నీటిగొట్టాన్ని రహస్యాంగంలో గుచ్చి అత్యాచారం చేశాడని ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. అయితే ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ఆమెను పరీక్షించిన లేడీ డాక్టర్ చెప్పారని పోలీసులు తెలిపారు.ఆమె రహస్య అవయవాల్లోకి ఏదీ చొప్పించలేదని, అయితే శరీరంలోని ఆ ప్రదేశంలో గాయం కావడంవల్లే రక్తస్రావం జరిగిందని డాక్టర్ చెప్పారు. బాధితురాలిని ఇక్కడి గురు తేజ్‌బహదూర్ ఆస్పత్రిలో చేర్పించారు.అదేరోజు అంటే సోమవారంనాడే నిందితుడిని అరె స్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు. బాధితురాలికి నష్టపరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తామని డిసిడబ్లూ తెలిపింది. ‘ఆ చిన్నారి అనుభవించిన బాధను మాటల్లో చెప్పలేము. నిందితుడికి మరణశిక్ష విధించాలి. అందుకు బాధితురాలికి అండగా నిలిచి న్యాయపోరాటం చేస్తాము. నష్టపరిహారం కోసం దరఖాస్తు దాఖలు చేయడమే కాక, ఆ బాలిక త్వరగా కోలుకోడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తాం’ అని స్వాతి మాలివాల్ తెలిపారు. ఆ ఏడాది మొదటి నాలుగు నెలల కాలంలో దేశ రాజధానిలో ప్రతిరోజూ ఇద్దరికంటే ఎక్కువ మంది బాలికలు అత్యాచారాలకు గురయ్యారనిఢిల్లీ పోలీసులు సేకరించిన సమాచారంద్వారా తెలిసింది.ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకూ దేశరాజధానిలో బాలలపై అత్యాచారం కేసులు 282 నమోదయ్యాయి. కాగా, గత ఏడాది 278 కేసులు నమోదయ్యాయి.