కిమ్, మూన్ అధికారిక చర్చలు

సియోల్: ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా నేత మూన్ జేఇన్ మధ్య మంగళవారం అధికారిక చర్చలు జరిగాయి. ఉత్తరకొరియాలోని అధికార వర్కర్స్ పార్టీ ప్రధాన కేం ద్రంలో ఈ ఇద్దరు నేతలు రెండు గంటలపాటు చర్చలు జరిపా రు. స్తంభించిన అణునిరస్త్రీకరణ చర్చలకు దీంతో ఊతం లభిం చే అవకాశం ఉంది. ‘మా మధ్య జరిగే చర్చలకు ఎంత ప్రాముఖ్యత ఉందో నాకు తెలుసు. మా చర్చల ఫలితంగా శాంతి, సౌభాగ్యాలు […]

సియోల్: ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా నేత మూన్ జేఇన్ మధ్య మంగళవారం అధికారిక చర్చలు జరిగాయి. ఉత్తరకొరియాలోని అధికార వర్కర్స్ పార్టీ ప్రధాన కేం ద్రంలో ఈ ఇద్దరు నేతలు రెండు గంటలపాటు చర్చలు జరిపా రు. స్తంభించిన అణునిరస్త్రీకరణ చర్చలకు దీంతో ఊతం లభిం చే అవకాశం ఉంది. ‘మా మధ్య జరిగే చర్చలకు ఎంత ప్రాముఖ్యత ఉందో నాకు తెలుసు. మా చర్చల ఫలితంగా శాంతి, సౌభాగ్యాలు విరాజిల్లుతాయని ప్రపంచ ప్రజలు గమనిస్తున్నా రు’ అని మూన్ చర్చల అనంతరం చెప్పారు. కొరియా యుద్ధ కాలంలో మూన్ తల్లిదండ్రులు సైతం ఉత్తరకొరియాను వదిలిపోయారు. ఆ యుద్ధం కారణంగా కొరియా ద్వీపకల్పం రెండు దేశాలుగా చీలిపోయింది. మూన్ మూడు రోజుల పర్యటన దశాబ్ద కాలంలో ప్యోంగ్యాంగ్‌కు తొలి దక్షిణ కొరియా అధ్యక్షుడి పర్యటన అని చెప్పాలి. దీనికి ముందు 2000లో కిమ్ డేజంగ్, 2007లో మూన్ గురువు రో మ్యూహ్యూన్ ఉత్తరకొరియాను సందర్శించారు. ఈ ఇద్దరు నేతల అధికారిక చర్చలకు ముందు ప్యోగ్యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిమ్, మూన్ ఆలింగనం చేసుకున్నారు. తర్వాత వారు నగర వీధుల గుండా ఒకే వాహనంలో ప్రయాణించారు. రోడ్డుకిరువైపులా వేలాది ప్రజలు పూలగుచ్ఛాలు పట్టుకుని ఏకస్వరంలో ‘దేశ పునరేకీకరణ’ అంటూ నినదించారు. ఆర్థిక దుస్థితి నేపథ్యంలో ద క్షిణ కొరియా అధ్యక్షుడి పోల్ రేటింగ్ బాగా దిగజారింది. ఆయనతో పాటు  వాణిజ్యవేత్తలు సామ్‌సంగ్ వారసుడు లీ జే యాం గ్, హ్యూందయ్ మోటార్ వైస్ చైర్మన్ పర్యటనలో ఉన్నారు.

Related Stories: