పక్కా ప్లాన్.. దృశ్యం ‘సీన్’

ప్రణయ్ పరువు హత్య కేసు నిందితులను ప్రవేశపెట్టిన నల్లగొండ పోలీసులు   ఎ1 అమృత తండ్రి మారుతీరావు, ఎ2 హంతకుడు బీహార్‌కు చెందిన సుభాష్ శర్మ, ఎ3 అస్గర్ అలీ, ఎ4 అబ్దుల్ బారీ, ఎ5 కరీం, ఎ6 శ్రవణ్ రూ. కోటి ఇవ్వడానికి ఒప్పందం, రూ.15 లక్షలు చెల్లింపు రెండుసార్లు విఫలమైన హత్యాయత్నం తల్లి ద్వారా సమాచారం సేకరించి ఆస్పత్రి వద్ద హత్య మన తెలంగాణ/ హైదరాబాద్: ఆ మధ్య విడుదలైన ‘దృశ్యం’ సినిమాలో కూతుర్ని వేధించిన […]

ప్రణయ్ పరువు హత్య కేసు నిందితులను ప్రవేశపెట్టిన నల్లగొండ పోలీసులు  

ఎ1 అమృత తండ్రి మారుతీరావు,

ఎ2 హంతకుడు బీహార్‌కు చెందిన సుభాష్ శర్మ,

ఎ3 అస్గర్ అలీ,

ఎ4 అబ్దుల్ బారీ,

ఎ5 కరీం, ఎ6 శ్రవణ్
రూ. కోటి ఇవ్వడానికి ఒప్పందం, రూ.15 లక్షలు చెల్లింపు
రెండుసార్లు విఫలమైన హత్యాయత్నం
తల్లి ద్వారా సమాచారం సేకరించి ఆస్పత్రి వద్ద హత్య

మన తెలంగాణ/ హైదరాబాద్: ఆ మధ్య విడుదలైన ‘దృశ్యం’ సినిమాలో కూతుర్ని వేధించిన వ్యక్తిని మూడో కంటికి తెలియకుండా హీరో వెంకటేష్ కుటుంబం హత్య చేస్తుంది. అదే పద్ధతిలో తన కూతుర్ని కులాంతర వివా హం చేసుకున్న ప్రణయ్‌ని కూడా హత మార్చాలని అమృ త తండ్రి మారుతీరావు భారీ స్కెచ్ వేశాడు. అమృత, ప్రణయ్ ప్రేమ వివాహం తరువాత మారుతీరావు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆ జంటను విడదీసేందుకు అన్ని రకాల ప్రయోగాలను చేసి విఫలమయ్యాడు. దీంతో మూడో కంటికి తెలియకుండా ప్రణయ్‌ని కిడ్నాప్ చేసి హత మార్చి మృతదేహాం సైతం లభించకుండా అచ్చం దృశ్యం సినిమాలో మాదిరిగా చేయాలనుకున్నాడు. ఇం దుకు తన సోదరుడు శ్రవణ్ సహకారం తీసుకునేందుకు తన పథకాన్ని అతని ముందు ఉంచాడు. అందుకు శ్రవణ్‌కూడా అంగీకరించాడు. అయితే ప్రణయ్‌ని కిడ్నాప్ చేయడానికి పలు విధాలుగా ప్రయత్నించి విఫలయత్నం చెందాడు. జనవరిలో పెళ్లి చేసుకున్న ప్రణయ్, అమృతలు ఆగస్టు 17న వెడ్డింగ్ రిసెప్షన్ భారీగా జరుపుకున్నారు. ఈ విడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన హత్య పథకం అమలు పర్చలేకపోతున్నానని మారుతీరావు మరింత రగిలిపోయాడు. ఇక లాభంలేదనుకుని అతడు సుపారి గ్యాంగ్‌ను ఆశ్రయించి చివరకు వారితోనే హత్య చేయించాడు. ఇక్కడ కూడా కేవలం తన తో పాటు సోదరుడు శ్రవణ్, హత్యకు పాల్పడిన బీహారి వాసి సుభాష్ శర్మలు మాత్రమే పోలీసులకు లొంగిపోయావలనుకున్నాడు. ఈ కేసులో సహకరించిన అస్గర్ అలీ, అబ్దుల్ బారీ, కాంగ్రెస్ నేత కరీం, డ్రైవర్ శివలను తప్పించడానికి హత్య అనంతరం సాక్షాధారాలను తారుమారు చేశాడు. హత్యకు ముందు నిందితుల మధ్య కూడా ఇదే తరహా ఒప్పందం కుదిరింది. హత్య అనంతరం నిందితులుగా కేవలం మారుతీరావు, శ్రావణ్, సుభాష్ శర్మల పేర్లు మాత్రమే బయటికి రావాలని ఎంత విచారించినా తమ పేర్లు రావద్దని..తమ పేర్లు బయటికి వస్తే తమ పాత కేసులు తిరిగి తోడుతారని..తద్వారా భవిష్యత్తులో తాము నల్గొండలో బతకడం కష్టంగా మారుతుందని అస్గర్ అలీ, అబ్దుల్ బారీ, కరీంలు మారుతీరావుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే పద్దతిలో హత్య అనంతరం మారుతీరావు వెంటనే స్పందించి హత్య తానే చేయించానని బహిరంగంగా అంగీకరించాడు. ఇతరుల పేర్లు బయటికి రాకుండా నాటకాలు ఆడాడు చివరకు పోలీసుల విచారణలో మొత్తం తతంగం బయట పడడంతో నిందితులందరు పట్టుబడ్డారు.

పక్కా ప్లాన్.. దృశ్యం ‘సీన్’

 సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య పూర్వాపరాలను నల్లగొండ ఎస్‌పి ఎం.వీ.రంగనాథ్ మంగళవారం సాయం త్రం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. హత్య కేసులో ఎ1గా తిరునగరు మారుతీరావు, ఎ2 సుభాష్‌కుమార్ ఉరఫ్ శర్మ, ఎ3 అస్గర్ అలీ, ఎ4 ఎండి అబ్దుల్‌బారి, ఎ5 అబ్దుల్‌క రీం, ఎ6 తిరునగరు శ్రవణ్‌కుమార్, ఎ7 సముద్రాల శివలను నిందితులుగా నిర్ధ్దారించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్‌పి తెలిపారు. ఇదిలా ఉండగా ఎ2 నిందితుడు సుభాష్‌శర్మ బీహార్ నుంచి రాత్రికి నల్లగొండ చేరుకునే అవకాశం ఉంది. ఆయన మినహా మిగిలిన ఆరుగురిని అరెస్టు చేశారు. ఈనెల 14వ తేదీన మధ్యాహ్నం మిర్యాలగూడ జ్యోతి ఆసుపత్రి వద్ద పెరుమాళ్ళ ప్రణయ్ భార్య అమృత వర్షిణి వైద్యం కోసం తల్లి ప్రేమలతతో కలిసి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ప్రణయ్ దారుణహత్యకు గురయ్యాడు. బీహార్ జగత్‌సింగ్పూర్‌కు చెందిన సుభాష్ కుమార్ ఉరఫ్ శర్మ పదునైన కత్తితో వెనుకవైపు నుంచి దాడి చేసి బలంగా తల, మెడపై నరికి కత్తిని అక్కడే వదిలి పారిపోయాడు. మిర్యాలగూడ పట్టణానికి చెం దిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి తిరునగరు మారుతీరావు ఏకైక కుమార్తె అయిన అమృత వర్షిణి, మృతుడు ఎస్‌సి సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్ ఇద్దరూ 9వ తరగతి నుంచి పరిచయంలో ఉండగా, ఆ పరిచయం ఇంటర్మీడియట్ వరకు వచ్చే సరికి ప్రేమగా మారింది. ఈ సమాచారంతో అమృత తండ్రి మారుతీరావు అతని సోదరుడు శ్రవణ్‌కుమార్‌కు తెలియజేయగా పలుమార్లు ప్రణయ్‌తో తిరుగవద్దని మందలించడంతో పాటు బెదిరింపులకు దిగారు. అయినప్పటికీ వారువురి ప్రేమ కొనసాగడంతో అమృతను ఇంటర్మీడియట్ బంద్ చేయించి ఇంటి వద్దనే ఉంచుకొని పరీక్షలు మాత్రం రాయించారు. ఆ తర్వాత కూడా ఇంటి వద్దనే ఒక సంవత్సరం ఖాళీగా ఉంచినా తదననంతరం హైదరాబాద్ బాచుపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ కోసం చేర్పించారు. అదే సమయంలో ఘట్‌కేసర్‌లోని శ్రీ నిధి కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న ప్రణయ్‌తో అమృత సంబంధాలు కొనసాగిస్తుందన్న తెలుసుకున్న మారుతీరావు చదువు మాన్పించి ఇంటి వద్దకు తిరిగి తీసుకొచ్చారు. అయినప్పటికీ అమృతవర్షిణి తమ ఫోన్ ద్వారా తరుచుగా చాటింగ్ చేయడం గమనించిన బాబాయి శ్రవణ్ పలు దఫాలు చేయిచేసుకున్నారు. ఇదే సమయంలో ప్రణయ్ తల్లిదండ్రులను పిలిపించి మీ అబ్బాయిని అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అమృత వెంటనే ప్రణయ్‌కు ఫోన్ చేసి బతుకైనా, చావైనా నీతోనే అని స్పష్టం చేయడంతో ఇరువురు ఇంటి వద్ద నుంచి ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ ఆర్యసమాజ్‌కు వెళ్ళి వివాహం చేసుకున్నారు. దీంతో మారుతీరావు స్థానిక మిర్యాలగూడ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టగా పోలీసులు హైదరాబాద్ నుంచి ఇరువురిని పిలిచి విచారించగా ఎవరి ప్రోద్బలం లేకుండా తమ ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నామని ఇక్కడే ఉంటామని తెలుపగా పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించి మారుతీరావును అమ్మాయి జోలికి వెళ్ళవద్దంటూ పోలీసులు హెచ్చరించి పంపించారు. దాంతో తనలాంటి పలుకుబడి కల్గిన వ్యక్తికే ఇలా జరుగుతుందా అని మనస్థాపానికి గురైన మారుతీరావు దీనంతటికి ప్రణయ్‌ను బాధ్యునిగా భావించి కక్షపెంచుకున్నాడు. ఆ తర్వాతకూడా ప్రణయ్ కుటుంబ సభ్యులను పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పించడం ద్వారా అమ్మాయిని తీసుకెళ్ళాలని అనేక ప్రయత్నాలు సాగించాడు. అయినప్పటికీ అమృత, ప్రణయ్‌లను విడగొట్టడం సాద్యపడకపోగా అప్పటికే అమృత గర్బం దాల్చగా మారుతీ రావు మదిలో మరింత కక్షపెరిగింది. ఈ నేపథ్యంలో అమృత, ప్రణయ్‌ల రిసెన్షన్ అట్టహాసంగా జరుపడంతో జీర్ణించుకోలేని మారుతీరావు తీవ్ర అవమానంగా భావించి తన తమ్ముడు శ్రవణ్‌తో, తన స్నేహితుడు అబ్దుల్ కరీంతో ఎలాగైన ప్రణయ్‌ను అంతమొందించి కూతురును ఇంటి తీసుకెళ్ళాలని పథకం రచించాడు. ఈ పరిస్థితుల్లో గతంలో భూవివాదంలో పాత నేరస్థుడు అబ్దుల్‌బారీని సంప్రదించి కూతరు ప్రేమ వివాహం తెలియజేసి ఎలాగైన ప్రణయ్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత అబ్దుల్‌బారీ వద్దకు వెళ్ళి జూలై మొదటివారంలో పూర్తి విషయాలను మాట్లాడాల్సిందిగా అబ్బుల్‌కరీంను హైదరాబాద్‌కు పంపించాడు. అనంతరం మూడు రోజులకు మిర్యాలగూడకు వస్తామని అబ్దుల్‌బారీ, అస్గర్‌అలీలు కారులో మిర్యాలగూడకు వచ్చి మారుతీరావు, అబ్దుల్ కరీంలు వారువురిని కలిసి ప్రణయ్ హత్య చేసేందుకు సుపారీ ఒప్పందం గురించి చర్చించి అస్గర్‌అలీ, బారీలు రూ. కోటి కోరగా అందుకు కరీం అంగీకారం తెలిపారు. జూలై రెండవ వారంలో రూ. 15లక్షలు మారుతీరావు కరీంకు ఇచ్చి బారీకి అందజేసేందుకు తన ఫార్చునర్ కారులో డ్రైవర్ శివతో పంపించాడు. వెంటనే అబ్దుల్‌బారీ గుజరాత్ హోంమంత్రి హిరేణ్‌పాండ్య హత్యకేసులో రాజమండ్రి జైలులో పరిచయమైన సుభాస్‌కుమార్ శర్మను సంప్రదించి ప్రణయ్‌ను చంపేందుకు ఒప్పించి బీహార్ నుంచి పిలిపించారు. శర్మ వచ్చిన ఆ తర్వాత అస్గర్‌అలీతో కలిసి ప్రణయ్‌ని ఏవిదంగా హత్య చేయాలని పథకం రచించారు. అనంతరం ఆగస్టు 22వ తేదీన మిర్యాలగూడలో ప్రణయ్‌ను తన ఇంటి వద్ద చంపడానికి ప్రయత్నించగా వీలు పడలేదు. హత్య చేయడంలో ఆలస్యమవుతుందన్న మారుతీరావు బారీని పిలిపించి అమ్మాయి 5మాసాల గర్బవతి అయినందున మెడికల్ చెక్‌అప్‌కు వెళ్తుందని ఆ పరిసరాల్లో ప్రయత్నించాలని సూచించగా ఈనెల 13వ తేదీన రాత్రి మారుతీరావు తన భార్య ద్వారా మరునాడు 14వ తేదీన మెడికల్ చెక్‌అప్‌కు వెళ్తుంతా లేదా అని తెలుసుకొని మరోమారు 14వ తేదీ ఉదయం కూడా నిర్దారించుకొని ఇదే అదునుగా ఎలాగైనా ప్రణయ్‌ను అంతమొందించాలని బారీకి తెలిజేసి పథకం ప్రకారం మారుతీరావు తన కారులో ముందే బయలుదేరి వెళ్ళాడు. అనుకన్న ప్రకారం మధ్యాహ్నం 1.30సమయంలో సుభాష్‌కుమార్‌శర్మ ఆసుపత్రి వద్ద పొంచివుండి చికిత్స అనంతరం బయటకొస్తున్న ప్రణయ్‌పై పదునైన కత్తితో వెనుకవైపు నుంచి దాడి చేసి తల, మెడలపై బలంగా నరికి హత్య చేశాడు. అప్పటికే అక్కడ కాపలాగా ఉన్న అస్గర్‌అలీతో కలిసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయాన్ని అబ్దుల్‌బారికి తెలియజేయగా పని అయి పోయిందంటూ మిగిలిన ఒప్పందం డబ్బులు పంపించాలని మారుతీరావుకు ఫోన్ లో చెప్పారు. ఆ వెంటనే మారుతీరావు కరీంకు తెలియజేసి మిర్యాలగూడ నుంచి వెళ్ళిపోవాలని సూచించారు.

Related Stories: