ఇవిఎంల తనిఖీ షురూ

మన తెలంగాణ/ సంగారెడ్డి: సంగారెడ్డి పాత డిఆర్‌డిఎ కార్యాలయంలోని గోదాంలో వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో ఇవిఎంల ఫస్ట్ లెవల్ చెకప్ నిర్వహించారు. బెంగళూరు బెల్ కంపెనీకి చెందిన 11 మంది ఇంజినీర్లు, ఒక ఉన్నతాధికారి ఎవిఎంలను జిల్లా కలెక్టర్ హన్మంత్‌రావు, జెసి, ఎస్‌పి చంద్రశేఖర్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఫస్ట్ లెవల్ చెకప్ నిమిత్తం హాలులో 11 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ఇంజినీరు ఒక్కో టేబుల్‌పై ఏర్పాటు చేసిన 10 బ్యాలెట్ యూనిట్లు, 10 కంట్రోల్ […]

మన తెలంగాణ/ సంగారెడ్డి: సంగారెడ్డి పాత డిఆర్‌డిఎ కార్యాలయంలోని గోదాంలో వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో ఇవిఎంల ఫస్ట్ లెవల్ చెకప్ నిర్వహించారు. బెంగళూరు బెల్ కంపెనీకి చెందిన 11 మంది ఇంజినీర్లు, ఒక ఉన్నతాధికారి ఎవిఎంలను జిల్లా కలెక్టర్ హన్మంత్‌రావు, జెసి, ఎస్‌పి చంద్రశేఖర్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఫస్ట్ లెవల్ చెకప్ నిమిత్తం హాలులో 11 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ఇంజినీరు ఒక్కో టేబుల్‌పై ఏర్పాటు చేసిన 10 బ్యాలెట్ యూనిట్లు, 10 కంట్రోల్ యూనిట్లు పని చేస్తున్నది.. లేనిది రాజకీయ పార్టీల నేతల ముందు పరిశీలించారు. జిల్లాకు 2,350 బ్యాలెట్ యూనిట్లు, 1830 కంట్రోల్ యూనిటు,్ల 1980 వివిప్యాట్స్ వచ్చాయి. కలెక్టర్ హన్మంత్‌రావు మాట్లాడుతూ ఫస్ట్ లెవల్ చెకప్ వీలయినంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇంజినీర్లకు సూచించామన్నారు. రోజువారి షెడ్యూల్ మేరకు ఇవి ఎంలు, వివివ్యాట్‌ల పరిశీలన పూర్తి చేయాలని కోరారు. రాజకీయ పార్టీల సమక్షంలో జరుగుతున్న ఈ ప్రక్రియలో వారికి ఎలాంటి సందేహాలున్నా ఒకటికి రెండు సార్లు చెకప్ చేసి చూపించాలని తెలిపారు. గోదాంలో నిర్వహిస్తున్న ఈవీఎం ఫస్ట్‌లెవల్ చెకప్ కార్యక్రమాన్ని, భద్రత ఏర్పాట్లను ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అడిగి తెలుసు కున్నారు. ఈవీఎంలు, వీవీఫ్యాట్‌ల భద్రతలపై ఆరా తీశారు. పరిశీలించిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను తీసిన బ్యాక్సులలో భద్రపర్చాలని జేసి నిఖిల సంబంధిత సిబ్బందికి సూచించారు. తొందరపడకుండా ,జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఏలాంటి సమస్య, ఇబ్బంది లేకుండా అన్ని వేళల అప్రమత్తులై విధులు నిర్వహించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. అన్ని పనులు సవ్యంగా జరిగేలా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఈవీఎంల ఫస్ట్‌లెవల్ చెకప్‌లో డిఆర్‌వో వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీకాంత్‌రెడ్డి, ఆర్‌డివో శ్రీను, డీఐవో శాంతికుమార్, తహాశీల్దార్ విజయ్‌కుమార్, ఏవో గుండేరావు, పాషా, రెవెన్యూ, డిఎస్‌వో, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related Stories: