విద్యుత్ ఉద్యోగ విజయం

ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సర్వీసుల క్రమబద్ధీకరణపై పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు 23,600 మంది ఆర్టిజన్ ఉద్యోగులకు ప్రయోజనం తీర్పుపై సిఎం కెసిఆర్ హర్షం, పిఆర్‌సి అమలుకు హామీ ఇక వారు రెగ్యులర్ ఉద్యోగులే : సిఎండి ప్రభాకర్‌రావు మన తెలంగాణ/ హైదరాబాద్ : విద్యుత్ సం స్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్‌ల (ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు) సర్వీసులను క్రమబద్ధీకరించడా న్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హై కోర్టు మంగళవారం కొట్టేయడంతో ఇంతకాలం ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో […]

ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సర్వీసుల క్రమబద్ధీకరణపై పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
23,600 మంది ఆర్టిజన్ ఉద్యోగులకు ప్రయోజనం
తీర్పుపై సిఎం కెసిఆర్ హర్షం, పిఆర్‌సి అమలుకు హామీ
ఇక వారు రెగ్యులర్ ఉద్యోగులే : సిఎండి ప్రభాకర్‌రావు

మన తెలంగాణ/ హైదరాబాద్ : విద్యుత్ సం స్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్‌ల (ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు) సర్వీసులను క్రమబద్ధీకరించడా న్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హై కోర్టు మంగళవారం కొట్టేయడంతో ఇంతకాలం ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్‌పిడిసిఎల్, ఎన్‌పిడిసిఎల్ సంస్థలలో పనిచేసే 23,600 మంది ఆర్టిజన్‌లను క్రమబద్ధీకరించడానికి మార్గం సుగమమైంది. ఆర్టిజన్‌ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంబంధిత శాఖ అధికారులను గతంలోనే ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు వారి సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ గతేడాది నాలుగు విద్యుత్ సంస్థలూ ఆదేశా లు జారీ చేశాయి. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొంత మంది హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేయడంతో విచారణ జరిపిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికుల విధులస్వభావం, ప్రతీ క్షణం ప్రమాదపుటంచుల్లో ఉంటూ విధులు నిర్వహిస్తున్న తీరును విద్యుత్ శాఖ తరపున హాజరైన లాయర్లు వివరించారు. ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి సర్వీసులను క్రమబద్ధీకరించకపోవడంతో తలెత్తుతున్న ఇబ్బందుల్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ మానవీయ ధృక్పధాన్ని అడ్డుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. మెరుగైన విద్యుత్ సరఫరాకు కష్టపడుతున్న ఆర్టిజన్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగానే ఉంటున్నారని, ఉద్యోగ భద్రత లేదని వివరించారు. ఈ వాదనలతో సానుకూలంగా స్పందించిన హైకోర్టు ఆ క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.
ముఖ్యమంత్రి హర్షం, పిఆర్‌సి అమలుకు హామీ :
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సేవలను క్రమబద్ధీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఆర్టిజన్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం ఎంతో మానవీయతతో నిర్ణయం తీసుకుందని, దాన్ని హైకోర్టు సమర్ధించడం సంతోషకరమని ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 23 వేల మంది ఆర్టిజన్లకు ఇది పండుగరోజుగా అభివర్ణించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు శ్రమదోపిడీకి గురికావద్దని, మంచి జీవన ప్రమాణాలతో వారి జీవించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని సిఎం వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు నేపధ్యంలో ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావుతో సిఎం మాట్లాడి వారి సర్వీసులను సమర్ధవంతంగా క్రమబద్ధీకరించాలని, రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, పే స్కేల్‌ను నిర్ణయించాలని, పిఆర్‌సి అమలు చేయాలని సిఎండికి స్పష్టంచేశారు. రెగ్యులర్ కాబోతున్న ఆర్టిజన్లకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక వారు రెగ్యులర్ ఉద్యోగులే : సిఎండి
హైకోర్టు తీర్పు పట్ల ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకరరావు సంతోషం వ్యక్తంచేశారు. ఆర్టిజన్లను క్రమబద్ధీకరించాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని, కోర్టు తీర్పుతో ప్రభుత్వ నిర్ణయం అమలుకు నోచుకోవడం ఆనందంగా ఉందని సిఎండి అన్నారు. విద్యుత్ శాఖకు ఇది శుభదినమని, ఇకనుంచి ఆర్టిజన్లు కూడా రెగ్యులర్ ఉద్యోగులేనని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ‘పే స్కేల్’ నిర్ణయిస్తామని, పిఆర్‌సిని అమలు చేస్తామని వెల్లడించారు. ఆర్టిజన్లను క్రమబద్దీకరించే విషయంలో సహకరించిన వారందరికీ సిఎండి ప్రభాకరరావు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సాధించుకున్న ఫలితాన్ని ఆర్టిజన్లు రెగ్యులరైజ్ కావడం వల్ల పొందగలిగారని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
తీర్పును స్వాగతించిన కార్మిక సంఘాలు
విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల క్రమబద్ధీకరణపై హైకోర్టు తీర్పును విద్యుత్ కార్మిక సంఘాలు స్వాగతించాయి.
న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయినందున విలీన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కార్మిక సంఘాలు యాజమాన్యాన్ని కోరాయి. గతంలోనే కార్మికులను విలీనం చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, న్యాయస్థానంలో సమర్థవాదనలు వినిపించిన లాయర్లు, యాజమాన్యాలకు, ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకరరావు, డిస్కంల సిఎండిలు రఘుమారెడ్డి, గోపాలరావులకు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.పద్మారెడ్డి, జి.సాయిబాబ కృతజ్ఞతలు తెలిపారు.