73కు చేరువలో రూపాయి

చారిత్రక కనిష్టానికి దేశీయ కరెన్సీ విలువ   డాలర్‌తో పోలిస్తే 72.98కి పతనం న్యూఢిల్లీ : అమెరికా డాలర్ మరింత బలపడుతుంటే, మరోవైపు రూపాయి మరింతగా క్షీణిస్తోంది. మంగళవారం రూపాయి చారిత్ర కనిష్టానికి పతనమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 47 పైసలు నష్టపోయి 72.98కి చేరింది. మొత్తానికి రూపాయి విలువ 73కు చేరువ అవుతోంది. ఈ ఏడాదిలో రూపాయి విలువ 13.5 శాతం క్షీణించింది. రూపాయి క్షీణతను అడ్డుకోవడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినప్పటికీ రూపా […]

చారిత్రక కనిష్టానికి దేశీయ కరెన్సీ విలువ

  డాలర్‌తో పోలిస్తే 72.98కి పతనం

న్యూఢిల్లీ : అమెరికా డాలర్ మరింత బలపడుతుంటే, మరోవైపు రూపాయి మరింతగా క్షీణిస్తోంది. మంగళవారం రూపాయి చారిత్ర కనిష్టానికి పతనమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 47 పైసలు నష్టపోయి 72.98కి చేరింది. మొత్తానికి రూపాయి విలువ 73కు చేరువ అవుతోంది. ఈ ఏడాదిలో రూపాయి విలువ 13.5 శాతం క్షీణించింది. రూపాయి క్షీణతను అడ్డుకోవడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినప్పటికీ రూపా యి పతనం ఆగడంలేదు. ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి 46 పైసలు క్షీణించి మరో చారిత్రాత్మక కనిష్టం 73 స్థాయికి చేరువలో ముగిసింది. పెరుగుతున్న చమురు ధరలకు తోడు ద్రవ్య లోటు, అంతర్జాతీయ అంశాలు రూపాయి విలువను ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు మసాలా బాండ్లపై ఉపసంహరణ పన్ను తొలగింపు, ఎఫ్‌పిఐల సడలింపు, దిగుమతి సుంకం పెంపు, క్యాడ్ నియంత్రణ లాం టి చర్యల్ని ప్రభుత్వం చేపట్టినా పరిస్థితి మారడం లేదు.
ఆర్‌బిఐ మరిన్ని చర్యలు చేపట్టాలి : బ్యాంక్ ఆఫ్ అమెరికా
రూపాయి పతనానికి బ్రేక్ వేసేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ లేదా ఆర్‌బిఐ మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉంద ని, ఆర్‌బిఐ మరో దఫా 2530 బిలియన్ డాలర్లను విక్రయించాలని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లింఛ్ అభిప్రాయం వ్యక్తం చేసింది.
వాస్తవ క్షీణత 7 శాతమే : ఐఎంఎఫ్
ద్రవ్యోల్బణం సర్దుబాటు తర్వాత ఏడాదిలో రూపాయి 67శాతం క్షీణిస్తుందని ఇంటర్నేషనల్ మోనెటరీ ఫండ్(ఐఎంఎఫ్) అంచనా వేసింది. అంటే ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు అయిన కరెన్సీ పతనంలో వాస్తవ పతనం సగమే ఉండాలి. చమురు వంటి దిగుమతులు ధరలు పెరగడం వల్ల రూపాయి మరింతగా క్షీణిస్తోందని, ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది.

Comments

comments