టెలికామ్‌కు ఆర్‌కామ్ గుడ్‌బై

 ఇక నుంచి రియల్టీపైనే దృష్టి: అనిల్ అంబానీ న్యూఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇక నుంచి పూర్తి గా టెలికామ్ వ్యాపారం నుంచి వైదొలుగుతోందని, భవిష్యత్‌లో రియల్ ఎస్టేట్‌పైనే దృష్టి పెట్టనున్నామని కంపె నీ అధినేత అనిల్ అంబానీ ప్రకటించారు. 2000 సంవత్సరంలో తక్కువ రేట్లతో టెలికామ్ సేవలను ప్రారంభించిన రిలయన్స్ కమ్యూనికేషన్ ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయి సతమతమవుతోంది. సంస్థకు దాదాపు రూ.40 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం అనిల్ అంబానీ తీవ్ర […]

 ఇక నుంచి రియల్టీపైనే దృష్టి: అనిల్ అంబానీ

న్యూఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇక నుంచి పూర్తి గా టెలికామ్ వ్యాపారం నుంచి వైదొలుగుతోందని, భవిష్యత్‌లో రియల్ ఎస్టేట్‌పైనే దృష్టి పెట్టనున్నామని కంపె నీ అధినేత అనిల్ అంబానీ ప్రకటించారు. 2000 సంవత్సరంలో తక్కువ రేట్లతో టెలికామ్ సేవలను ప్రారంభించిన రిలయన్స్ కమ్యూనికేషన్ ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయి సతమతమవుతోంది. సంస్థకు దాదాపు రూ.40 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం అనిల్ అంబానీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కారణంగా టెలికాం వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) ఛైర్మన్ అనిల్ అంబానీ వెల్లడించారు.భవిష్యత్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై దృష్టి సారించనున్నామని చెప్పారు. మంగళవారం 14 వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ‘2000 సంవత్సరంలో అత్యంత తక్కువ ధరకు టెలికాం సేవలను అందించాలనే లక్ష్యంతో ఆర్‌కామ్ సేవలను ప్రారంభించాం. అయితే ఇప్పుడు సంస్థ రూ.40వేల కోట్ల రుణ భారంతో ఉంది. ఇక ఈ రంగంలో కొనసాగకూడదని మేం భావిస్తున్నాం. మొబైల్ రంగం నుంచి వైదొలగి రిలయన్స్ రియల్టీపై దృష్టిపెట్టనున్నాం’ అని పేర్కొన్నారు. ముంబయి శివార్లలో 133 ఎకరాల్లో విస్తరించి ఉన్న దీరూభాయ్ అంబానీనాలెడ్జ్ సెంటర్(డిఎకెసి)పై మాట్లాడుతూ, స్థిరాస్తి వ్యాపారంలో అపరిమిత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. డిఎకెసి కేంద్రంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఆర్‌కామ్‌కు దాదాపు38 రుణ సంస్థలు రూ.40 వేల కోట్ల అప్పులు ఇవ్వగా, వీటి లో చైనా బ్యాంకులు కూడా ఉన్నాయి. వ్యూహాత్మక రుణ పునర్నిర్మాణం(ఎస్‌డిఆర్) ప్రక్రియ ద్వారా రుణాల పరిష్కారానికి సంస్థ ప్రయత్నిస్తోంది. వచ్చే నెలలో రిసొల్యూషన్ పొందుతామని అంబానీ తెలిపారు. స్పెక్ట్రమ్ పంచుకోవడం, వ్యాపారం కోసం డాట్(టెలికామ్ శాఖ) నుంచి అనుమతి కోసం వేచిచూస్తున్నామని అన్నారు.

Comments

comments

Related Stories: