ఇన్ఫీకి ఎదురుదెబ్బ

బన్సాల్‌కు రూ.12.17 కోట్లను చెల్లించాల్సిందే   ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశం బెంగళూరు : దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్‌కు ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. ఇన్ఫీ మాజీ సిఎఫ్‌ఒ(చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) రాజీవ్ బన్సాల్‌కు సెవెరన్స్ ప్యాకేజీ కింద రూ.12.17 కోట్లను వడ్డీ కలిపి చెల్లించాల్సిందేనని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈమేరకు స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. బన్సాల్‌కు సెవరన్స్ ప్యాకేజీ కింద రూ. 17.38 కోట్లు లేదా 24 నెలల జీతం చెల్లించేందుకు […]

బన్సాల్‌కు రూ.12.17 కోట్లను చెల్లించాల్సిందే 

 ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశం

బెంగళూరు : దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్‌కు ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. ఇన్ఫీ మాజీ సిఎఫ్‌ఒ(చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) రాజీవ్ బన్సాల్‌కు సెవెరన్స్ ప్యాకేజీ కింద రూ.12.17 కోట్లను వడ్డీ కలిపి చెల్లించాల్సిందేనని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈమేరకు స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. బన్సాల్‌కు సెవరన్స్ ప్యాకేజీ కింద రూ. 17.38 కోట్లు లేదా 24 నెలల జీతం చెల్లించేందుకు కంపెనీ గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా తొలి విడతగా రూ.5.2 కోట్లు చెల్లించింది. అయితే బన్సాల్‌కు ఇస్తున్న సెవరన్స్ ప్యాకేజీ చాలా ఎక్కువగా ఉందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఇతర సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన చెల్లింపులను కంపెనీ నిలిపివేసింది. దీంతో రాజీవ్ బన్సాల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో తదుపరి కార్యాచరణపై తాము న్యాయసలహా తీసుకోనున్నట్లు కంపె నీ పేర్కొంది. బన్సాల్ సెవెరన్స్ ప్యాకేజీ కంపెనీలో వివాదానికి దారితీయగా, ఇన్ఫోసిస్‌లో పాలనా పరమైన లోపాలను సంస్థ వ్యవస్థాపకులు ఎత్తిచూపారు. రాజీవ్ బన్సాల్ 2015లో కంపెనీ నుంచి వైదొలినప్పుడు రూ.17.38 కోట్లు చెల్లిస్తామని కంపెనీ అంగీకరించింది. దీనిపై తాజాగా విచారించిన ట్రైబ్యూనల్ రాజీవ్‌కు మిగతా రూ. 12.17 కోట్లు వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని ఇన్ఫోసిస్‌ను ఆదేశించింది. బన్సాల్‌కు చెల్లించిన రూ. 5.2 కోట్లను తమ సంస్థకు రీఫండ్ చేయాలని కోరుతూ ఇన్ఫోసిస్ వేసిన కౌంటర్ పిటిషన్‌ను కూడా ట్రైబ్యూనల్ కొట్టివేసినట్లు సంస్థ తెలిపింది.

Comments

comments

Related Stories: