ధావన్ ధనాధన్

రాణించిన రాయుడు, కార్తీక్, భారత్ 285/7 దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా పసికూన హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు దూకుడుగా ఆడారు. రోహిత్ తన మార్క్ షాట్లతో అలరించాడు. అయితే 22 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేసిన రోహిత్‌ను ఎహెసాన్ ఖాన్ వెనక్కి పంపాడు. దీంతో […]

రాణించిన రాయుడు, కార్తీక్, భారత్ 285/7

దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా పసికూన హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు దూకుడుగా ఆడారు. రోహిత్ తన మార్క్ షాట్లతో అలరించాడు. అయితే 22 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేసిన రోహిత్‌ను ఎహెసాన్ ఖాన్ వెనక్కి పంపాడు. దీంతో భారత్ 45 పరుగుల వద్దు తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడుతో కలిసి ధావన్ పోరాటం కొనసాగించాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుచుతూ స్కోరు వేగం తగ్గకుండా చూశారు. ఇంగ్లండ్ టూర్‌లో పేలవమైన ఫాంతో నిరాశ పరిచిన ధావన్ ఈ మ్యాచ్‌లో మాత్రం అద్భుతంగా ఆడాడు. హాంకాంగ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగుల వర్షం కురిపించాడు. రాయుడు కూడా దూకుడును కొనసాగించారు. వీరిని ఔట్ చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే క్రమంలో ఇద్దరు భారత్ స్కోరును వంద దాటించారు. తర్వాత మరింత చెలరేగి ఆడారు. అంతేగాక ఇటు అటు రాయుడులు అర్ధ సెంచరీలు కూడా పూర్తి చేశారు. అయితే 70 బంతుల్లో 3ఫోర్లు, రెండు సిక్సర్లతో 60 పరుగులు చేసిన రాయుడును నవాజ్ వెనక్కి పంపాడు. దీంతో 116 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన దినేష్ కార్తీక్ అండతో ధావన్ జోరును కొనసాగించాడు. కార్తీక్ కూడా సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ ధావన్‌కు అండగా నిలిచాడు. ఇద్దరు మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిని ఔట్ చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన ధావన్ 105 బంతుల్లో 13 ఫోర్లతో శతకాన్ని పూర్తి చేశాడు. ధావన్‌కు ఇది వన్డేల్లో 14వ శతకం కావడం విశేషం. అయితే 120 బంతుల్లో రెండు సిక్సర్లు, మరో 15 బౌండరీలతో 127 పరుగులు చేసి షా బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరోవైపు ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన సీనియర్ ఆటగాడు ధోని ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. కార్తీక్ కూడా 3ఫోర్లతో 33 పరుగులు చేసి వెనుదిరిగాడు. భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కేదార్ జాదవ్ అజేయంగా 28 పరుగులు చేశాడు. దీంతో భారత్ స్కోరు 285 పరుగులకు చేరింది.
హాంకాంగ్ జోరు…


తర్వాత భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్‌కు ఓపెనర్లు నిజాకత్ ఖాన్, అన్షుమన్ రాత్ అద్భుత శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే అడపాదడపా ఫోర్లతో స్కోరు వేగం తగ్గకుండా చూశారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత కెప్టెన్ తరచు బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. ఇదే సమయంలో ఇద్దరు మొదటి వికెట్‌కు వంద పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను నెలకొల్పారు. తాజా సమాచారం లభించే సమయానికి హాంకాంగ్ 24 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 124 పరుగులు చేసింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన అన్షుమన్ 68 బంతుల్లో మూడు ఫోర్లతో 44 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. మరోవైపు భారత బౌలర్లను హడలెత్తించిన ఖాన్ 79 బంతుల్లో పది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 71 పరుగులు చేసి క్రీజులో నిలిచాడు. హాంకాంగ్ విజయం సాధించాలంటే 26 ఓవర్లలో మరో 162 పరుగులు చేయాలి.

Comments

comments

Related Stories: