ఔషధాలపై నిషేధాలు

ప్రభుత్వం ఇటీవల అనేక మందులను నిషేధించింది. దీనివల్ల సమస్యలు తలెత్తుతాయని చాలామంది ఆందోళన వెలి బుచ్చుతున్నారు. ప్రభుత్వం 328 ఫిక్సెడ్ డోస్ కాంబినేషన్ మందులను నిషేధిం చింది. సెప్టెంబర్ 7వ తేదీన ఈ నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఈ నిషేధం వల్ల దాదాపు నెలరోజుల పాటు యాంటీబయాటిక్స్, అనాల్జి సిక్ యాంటి డయాబెటిక్ తదితర మందులకు కొరత రావచ్చని ఫార్మసిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే డాక్టర్లు మాత్రం భయపడవలసిన పనిలేదంటున్నారు. ఈ మందులను నిషేధించి నప్పటికీ […]

ప్రభుత్వం ఇటీవల అనేక మందులను నిషేధించింది. దీనివల్ల సమస్యలు తలెత్తుతాయని చాలామంది ఆందోళన వెలి బుచ్చుతున్నారు.
ప్రభుత్వం 328 ఫిక్సెడ్ డోస్ కాంబినేషన్ మందులను నిషేధిం చింది. సెప్టెంబర్ 7వ తేదీన ఈ నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఈ నిషేధం వల్ల దాదాపు నెలరోజుల పాటు యాంటీబయాటిక్స్, అనాల్జి సిక్ యాంటి డయాబెటిక్ తదితర మందులకు కొరత రావచ్చని ఫార్మసిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే డాక్టర్లు మాత్రం భయపడవలసిన పనిలేదంటున్నారు. ఈ మందులను నిషేధించి నప్పటికీ ప్రత్యామ్నాయ ఔషధాలు చాలా ఉన్నాయంటున్నారు.
సాధారణంగా ఇండ్లలో ఉపయోగించే మందులు, జిపిఏజడ్, నార్ మెట్రోజిల్, నాసివియన్ క్లాసిక్ అడల్ స్ప్రే, చెస్టన్ కోల్డ్, అజిత్రాల్ ఏ, నిసిప్ కోల్ అండ్ ఫ్లూ, సుప్రిమాక్స్ ప్లస్, రిడాల్ ఓజడ్, అస్కారిల్ డి, విస్కోరైన్ వంటి మందులను ప్రభుత్వం ఇప్పుడు నిషేధించింది.
డాక్టర్లు సాధారణంగా ఫిక్సెడ్ డోస్ కాంబినేషన్ ఔషధాలు రాస్తుంటారు. ఫిక్సెడ్ డోస్ కాంబినేషన్ అంటే నిర్దిష్ట డోసేజిలో రెండు లేదా ఎక్కువ మందులను ఒకే ఔషధంగా, ఒకే డోసుగా ఇచ్చే ఔషధాలు. అసలు ఈ ఫిక్సెడ్ డోస్ కాంబినేషన్లు లేకుండా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీటి వల్ల అదనంగా లభించే చికిత్సా పరమైన ప్రయోజనాలు ఏవీ లేవని చాలా మంది భావిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వీటి వల్ల వ్యాధి నిరోధక శక్తిపై కూడా ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
ఆరోగ్యశాఖ తక్షణం అమలయ్యే విధంగా ఈ మందులను నిషేధించింది. ఈ మందుల కాంబినేషన్ల ప్రయోజనాల గురించి అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక తర్వాత వీటిని నిషేధించడం జరిగింది. ఈ నిషేధాజ్ఞల తర్వాత కెమిస్టులు, మందుల షాపులు ఆందోళన వెలిబుచ్చాయి. దీనివల్ల అవసరమైన ఔషధాలు కరువవుతాయని అభిప్రాయ పడు తున్నారు. దేశంలో ఎనిమిది లక్షలమంది ఔషధ వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ వెంటనే ప్రతిస్పందించింది. ఈ వ్యాపారులు తమ వద్ద ఉన్న స్టాకులను హోల్ సేల్ వ్యాపారులకు వెనక్కి పంపిస్తున్నారు. హోల్‌సేల్ వ్యాపారులు ఈ మందులను తయారీ కంపెనీలకు పంపిస్తారు. ఈ మందులన్నిటినీ వెనక్కి పంపడానికి సిద్ధంగా ఉన్నామని రిటైల్ వర్తకుల సంఘం అధ్యక్షుడు తెలియజేశారు. ఈ మందుల స్థానంలో ప్రత్యామ్నాయ ఔషధాలు రావడానికి సమయం పడుతుంది. ఈ నిషేధం వెంటనే అమలవ్వాలని చెప్పారు కాబట్టి ప్రత్యామ్నాయ ఔషధాలు రావడానికి సమయం పట్టవచ్చు కాబట్టి మరో రెండు మూడు నెలల కాలం పేషంట్లకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అంతేకాదు మందుల షాపులు సెలవు ప్రకటించి, ఈ మందులను షాపుల నుంచి తొలగించి వెనక్కు పంపవలసి ఉంటుం ది. ఈ స్టాకులన్నీ తొలగించి ప్రత్యామ్నాయ ఔషధాలు రావాలంటే కనీసం రెండు నెలల కాలం అవసరమవుతుంది. అయితే నిషేధించ బడిన మందులను తాము రోగులకు రాయడం లేదని డాక్టర్లు భరోసా ఇచ్చారు.
రెండు మూడు మందుల కాంబినేషన్ డోసును చాలామంది డాక్టర్లు కూడా ఇష్టపడడం లేదు. కాని పేషంట్లకు సదుపాయంగా ఉంటుందని కొందరు డాక్టర్లు వీటిని రాసేవారు. ఫిక్సెడ్ డోస్ కాంబినేషన్లు లేకపోయినా ఫర్వాలేదు, మనవద్ద సింగిల్ డోస్ ఔషధాలు ఉన్నాయని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు.
ఫిక్సెడ్ డ్రగ్ కాంబినేషన్ల మార్కెటు చాలా పెద్దది. ఇవి చాలా సదుపాయంగాను, చాలా చౌకగాను లభిస్తాయి కాబట్టి మందుల తయారీ కంపెనీలు వివిధ కాంబినేషన్లలో వీటిని తయారు చేయడం ప్రారంభించాయి. నిబంధనలు కూడా మెతగ్గా ఉండడం వల్ల వారికి కలిసి వచ్చింది. ఈ ఔషధాలు చికిత్సలో ఎంతవరకు ప్రయోజనకర మన్న ప్రశ్నలు కూడా వినిపిస్తూ వచ్చాయి.
పైగా వీటివల్ల మందులు ప్రభావం కోల్పోయే ప్రమాదం కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. 2016లో ఇదేవిధంగా 349 ఎఫ్‌డిసి మందులను ప్రభుత్వం నిషేధించింది. వీటివల్ల ప్రమాదమని, సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఉన్నా యని తెలిపింది. ఈ నిషేధాలను మందుల కంపెనీలు కోర్టుల్లో సవాలు చేశాయి. గత డిసెంబరులో సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని పరి శీలించాలని డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డును కోరింది. బోర్డు పరిశీలన తర్వాత 334 ఎఫ్‌డిసి మందుల్లో ఎలాంటి చికిత్సాపరమైన అదనపు ప్రయోజనాలు లేవని, వాటిని నిషేధించడం మంచిదని సిఫారసు చేసింది.
ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ ప్రకారం నిషేధించబడిన మందుల టర్నోవరు 1,040 కోట్ల రూపాయలు. ఈ నిషేధం వల్ల 1360 మెడిసిన్ బ్రాండులపై ప్రభావం పడింది. ముఖ్యంగా మేక్లియోడ్స్ ఫార్మాస్యూటికల్స్ సంస్థకు సంబంధించి ఈ ఎఫ్‌డిసి మందుల కాంబినేషన్లు 292 కోట్ల రూపాయల విలువైనవి ఇప్పుడు నిషేధించబడ్డాయి. ఈ సంస్థ ఈ నిషేధం వల్ల తీవ్రంగా దెబ్బతింది. ఇతర మందుల కంపెనీల విషయానికి వస్తే మ్యాన్ కైండ్ ఫార్మాస్యూటికల్స్ 65 కోట్ల రూపాయలు, ఆల్కెమ్ లేబొరేటరీస్ 58 కోట్ల రూపాయలు, ఎఫ్‌డిసి లిమిటెడ్ 58 కోట్ల రూపాయలు, మెడ్లీ ఫార్మా సూటికల్స్ 41 కోట్ల రూపాయలు నష్టపోతున్నాయి.
భారతదేశంలో ఎఫ్‌డిసి మందులు చాలా ఎక్కువ. దాదాపు 2000 రకాలున్నాయి. అమెరికాలో కన్నా మూడురెట్లు ఎక్కువ. ఎఫ్‌డిసి వల్ల ప్రయోజనమేమిటంటే పేషెంటు రెండు మూడు మందు లు కొనేబదులు ఒకే మందు తీసుకుంటే సరిపోతుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. కొత్త మందులను కనిపెట్టడం కన్నా పాత మందు ల కాంబినేషన్లు తయారు చేసి మార్కెట్‌లో ప్రవేశపెట్టడం కంపెనీ లకు కూడా చవుకైన వ్యవహారం.
మరో విషయమేమంటే, సింగిల్ డ్రగ్ డోసులపై ధరల నియంత్రణ ఉంటుంది. ఎఫ్‌డిసి ధరలపై నియంత్రణ లేదు కాబట్టి కంపెనీలు ఈ మందులను తయారు చేయడానికే ఉత్సాహం చూపి స్తున్నాయి. ఏది ఏమైనా ప్రజారోగ్యం ప్రధానంగా ఈ విషయంలో నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఎఫ్‌డిసిల వల్ల ప్రజారోగ్యానికి నష్టమని నిపుణులు భావిస్తున్నప్పుడు ఈ నిషేధాలు మంచివే. ఫార్మా కంపెనీ లు కూడా కేవలం వ్యాపార ప్రయోజనాలు, ధనార్జన మాత్రమే కాక, ప్రజల ఆరోగ్యం, ప్రజా సంక్షేమాన్ని కూడా దృష్టి లో ఉంచుకోవాలి.

* హిమానీ చందా
(ది ప్రింట్)

Comments

comments