టెలికం వ్యాపారం నుంచి తప్పుకున్నఅనిల్ అంబానీ!

న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) చైర్మన్ అనిల్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెలికం వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు అనిల్ అంబానీ తెలిపారు. మంగళవారం జరిగిన 14వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అనిల్ అంబానీ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. టెలికం సేవలను అత్యంత చవగ్గా అందించే ఉద్దేశంతో 2000 సంవత్సరంలో ఆర్‌కామ్‌ను ప్రారంభించినట్టు చెప్పారు.  ప్రస్తుతం రూ.40 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్టు అనిల్ చెప్పారు. ఇకపై ఈ రంగంలో కొనసాగకూడదని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే […]

న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) చైర్మన్ అనిల్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెలికం వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు అనిల్ అంబానీ తెలిపారు. మంగళవారం జరిగిన 14వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అనిల్ అంబానీ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. టెలికం సేవలను అత్యంత చవగ్గా అందించే ఉద్దేశంతో 2000 సంవత్సరంలో ఆర్‌కామ్‌ను ప్రారంభించినట్టు చెప్పారు.  ప్రస్తుతం రూ.40 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్టు అనిల్ చెప్పారు. ఇకపై ఈ రంగంలో కొనసాగకూడదని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే మరో వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలిపారు. స్థిరాస్తి రంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు వివరించారు.

Comments

comments