చెలరేగిన ధావన్.. హాంగ్‌కాంగ్‌ టార్గెట్ 286

దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా హాంగ్‌కాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. దీంతో భారత్, పసికూన హాంగ్‌కాంగ్‌ జట్టుకు 286 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా  బ్యాటింగ్‌కు దిగిన భారత  ఓపెనర్లు నిలకడగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ(23) 8వ ఓవర్లో నిజాకత్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో  ధావన్, అంబటి రాయుడుతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. శిఖర్ ధావన్ […]

దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా హాంగ్‌కాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. దీంతో భారత్, పసికూన హాంగ్‌కాంగ్‌ జట్టుకు 286 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా  బ్యాటింగ్‌కు దిగిన భారత  ఓపెనర్లు నిలకడగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ(23) 8వ ఓవర్లో నిజాకత్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో  ధావన్, అంబటి రాయుడుతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. శిఖర్ ధావన్ (127 ; 120 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్ లు) సెంచరీతో అలరించాడు. వన్డే కెరీర్లో శిఖర్ ధావన్ కిది 14వ సెంచరీ. మరోవైపు  అంబటి రాయుడు   60(70 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్‌‌) పరుగులు చేసి తన కెరీర్‌లో 7వ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత దినేష్ కార్తిక్ 33, జాదవ్ 28, భువనేశ్వర్ కుమార్ 9 పరుగులు చేయగా, ఎంఎస్ ధోని డకౌట్ అయ్యాడు. హాంగ్ కాంగ్ బౌలర్లలో కించిత్ షా 3, ఈశాన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా, ఈశాన్ నవాజ్, ఐజాజ్‌ ఖాన్ తలో వికెట్ తీశారు.

Comments

comments