సఫారీ మహిళల గెలుపు

బార్బడోస్: విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 46 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. స్వల్ప లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య విండీస్‌కు ప్రారంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. సఫారీ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ విండీస్‌ను […]

బార్బడోస్: విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 46 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. స్వల్ప లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య విండీస్‌కు ప్రారంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. సఫారీ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ విండీస్‌ను కోలుకోనివ్వలేదు. ఓపెనర్ మాథ్యూస్ (౦) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరింది. తర్వాత వచ్చిన కెప్టెన్ స్టెఫాని టైలర్ కూడా నిరాశ పరిచింది. 8 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగింది. జట్టును ఆదుకుంటుందని భావించిన చెడిన్ నెషన్ కూడా తక్కువ స్కోరుకే ఔటైంది. చెడిన్ పది పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ కిసియా నైట్ 23 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. కాగా, క్యాంప్‌బెల్ మాత్రం ఒంటరి పోరాటం చేసింది. సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఆమె 3 ఫోర్లతో 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగిలిన వారిలో డొటిన్ (19), అనీసా మహ్మద్ (23) మాత్రమే రాణించారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో కాప్ మూడు వికెట్లు తీసింది. టుమి, జెంట్లి మాలె రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను విండీస్ బౌలర్లు ఊహించిన దానికంటే తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఓపెనర్ లిజెలె లి (౦) సున్నాకే పెవిలియన్ చేరింది. అయితే లౌరా వాల్‌వర్డ్‌ట్ (45), సునె లూస్ (58) జట్టును ఆదుకున్నారు. ఇద్దరు రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన నికర్క్ 4 ఫోర్లతో 46 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. విండీస్ బౌలర్లలో టైలర్ మూడు వికెట్లు తీసింది.

Comments

comments

Related Stories: