అమానవీయ సెక్షన్ 377

సెక్షన్ 377 రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకే భంగకరంగా ఉంది. రాజ్యాంగంలోని సెక్షన్14 సమానంగా జీవించే హక్కును, సెక్షన్15 లింగవివక్ష నుండి రక్షణను, సెక్ష న్ 19 గోప్యతను కాపాడడం, సెక్షన్ 21 గౌరవంగా బతికే హక్కును దేశంలోని ప్రతి పౌరుడికి ప్రసాదించాయి. స్వలింగ ఆకర్షణను చట్ట పరిధిలోకి తేవడమే సామాజికద్రోహం. నాలుగు గోడల మధ్య జరిగే ప్రక్రియను నేరంగా పరిగణిస్తూ శరీర నిర్మాణ రీత్యా పురి విప్పిన వారి ఆశలను అసహజమనే, శిక్షార్హమనే హక్కు ఎవరికీ లేదు. […]

సెక్షన్ 377 రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకే భంగకరంగా ఉంది. రాజ్యాంగంలోని సెక్షన్14 సమానంగా జీవించే హక్కును, సెక్షన్15 లింగవివక్ష నుండి రక్షణను, సెక్ష న్ 19 గోప్యతను కాపాడడం, సెక్షన్ 21 గౌరవంగా బతికే హక్కును దేశంలోని ప్రతి పౌరుడికి ప్రసాదించాయి. స్వలింగ ఆకర్షణను చట్ట పరిధిలోకి తేవడమే సామాజికద్రోహం. నాలుగు గోడల మధ్య జరిగే ప్రక్రియను నేరంగా పరిగణిస్తూ శరీర నిర్మాణ రీత్యా పురి విప్పిన వారి ఆశలను అసహజమనే, శిక్షార్హమనే హక్కు ఎవరికీ లేదు.

సుమారు 160 ఏళ్లపాటు విభిన్న లింగ అల్పసంఖ్యాకులను వేధించిన సెక్షన్ 377ను సెప్టెంబర్ 6 నాడు సుప్రీంకోర్టు సవరిస్తూ, నేర పరిధిలోంచి తొలగించడాన్ని చరిత్రాత్మక తీర్పుగా పరిగణించాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ తీర్పు ప్రశంసలందుకుంటోం ది. దేశ వ్యాప్తంగా ఎల్‌జిబిటి (లెస్బియన్, గే, బై సెక్సువల్,ట్రాన్స్ జెండర్) సంస్థలు సంబరాలు చేసుకుంటూ ప్రదర్శనలు, ఊరేగింపులు చేపట్టాయి. ఈ తీర్పును ఐక్యరాజ్య సమితి ఆహ్వానించింది. సెక్షన్ 377 లోని మనుషుల మధ్య భిన్న సంపర్కాన్ని నేర పరిధిలోంచి తొలగించి సుప్రీంకోర్టు ఎల్‌జిబిటిల ఆత్మ గౌరవాన్ని కాపాడిందని సమితి వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై అయిదుగురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి రావడం ఓ విశేషం. అందులో జస్టిస్ ఇందు మల్హోత్రా మహిళా జడ్జి ఒకరు. శారీరక విలక్షణతని నేరంగా భావించడం ప్రాథమిక హక్కుకే భంగకరమని ఇందు వ్యాఖ్యానించారు.

25 ఏళ్లపాటు కోర్టు మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉన్న వివక్షను తుదకంటూ చేర్చినవాడు నవ్‌తేజ్ సింగ్ జోహార్ అనే నాట్యాచార్యుడు. 2013లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కుదరదు పొమ్మన్నా పట్టువిడవకుండా తిరిగి 2016లో అదే కోర్టు తలుపు తట్టి న్యాయ పోరాటంలో జయం సాధించాడాయన.

ఔరంగజేబు విధించాడనే జుట్టు పన్నుకు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 377కి పెద్ద భేదమేమీ లేదు. రాజులకు నచ్చని విషయాలకు ప్రజలు దూరంగా ఉండేందుకు వారిని ఆర్థికంగానో, చట్టపరంగానో ఇబ్బందులపాలు చేయడం ఈనాటి విషయం కాదు. విక్టోరియా రాణికి అయిష్టమనిపించిన స్వలింగ సంపర్కం బ్రిటీష్ సామ్రాజ్యమంతా నేరంగా పరిగణింపబడింది. 42 వలస దేశాల్లో ఇది శిక్షాస్మృతిలో చేర్చబడింది. 1861 లో లార్డ్ మెకాలే చే విరచిత ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 377 ప్రకారం గుదమైధునం శిక్షార్హమైన నేరము. దానికి పాల్పడిన వారికి ఆ జన్మఖైదుగానీ, పదేళ్ల జైలు శిక్షగాని వేయబడుతుంది. ఈ నేరానికి శిక్ష చలామణీ అవుతూనే ఉంది. ఉన్నత కుటుంబాల్లో సాగుతున్న స్వలింగ సంపర్కం బహిర్గతం కాకపోవడంతో అసలు అలాంటి పనులు మన ఇంటావంటా లేవని కొందరు ప్రకటించినా సామాన్యులు మాత్రం ఈ సెక్షన్ బారినపడి జైలు పాలవుతున్నారు. barber arrested in sodomy charge అని టైమ్స్ ఆఫ్ ఇండియాలో 1990లో ఓ వార్త వచ్చింది. కైలాష్ చంద్ అనే మంగలి సెక్షన్ 377 కింద అరెస్టయ్యాడు. ఇలా సామాన్యులెందరో ఈ చట్టం చేత చిక్కి శిక్షింపబడ్డారు.

2015, 2016 సంవత్సరాల్లో ఢిల్లీ పోలీసులు స్వలింగ సంపర్కుల వేడుకపై దాడి చేసి సుమారు వంద మందిని సెక్షన్ 377 కింద అరెస్టు చేశారు. 80 శాతం ఇలాంటి కేసులు నిరాధారంగా కొట్టివేయబడినా వారి హక్కులకు భంగం కలిగించడం హేయమని ఢిల్లీ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ కోర్టులో వాదించారు. వలస రాజ్యంలో ఏర్పడ్డ చట్టాల కింద భారతీయులు నలిగిపోవడం ఈ ఆధునిక సమాజంలో గర్హనీయమంటూ నాజ్ ఫౌండేషన్ డైరెక్టర్ అంజలి గోపాలన్ పోరాడారు.

ప్రపంచంలో సుమారు 4 శాతం జనాభా జన్యుపరమైన లైంగిక అసమతుల్యతతో పుడతారని ఓ విశ్లేషణలో తేలింది. తల్లి గర్భంలోనే శిశువు మెదడుపై తల్లిలోని వ్యాధి నిరోధక శక్తి చేసే అనూహ్య దాడి వల్ల బిడ్డలో విభిన్న లక్షణాలు చోటు చేసుకుంటాయని ఓ పరిశీలన చెబుతోంది. అయితే ఇతమిథ్ధంగా శిశువులో స్వలింగ ఆకర్షణ లక్షణాలు రావడానికి ఇవీ కారణాలు అంటూ ఇంకా తేలవలసి ఉందని వైద్యులు అంటున్నారు.

అసలు జీవుల మధ్య శారీరక ఆకర్షణ ఈ విధంగానే ఉండాలనే నిర్దిష్ట సూత్రమేదీ లేదు. అధిక సంఖ్యాకుల మధ్య ఉండే విధానమే సరియైనది అనడం మిగతా వారిపట్ల ద్రోహ చింతనే అవుతుంది. వారివారి శారీరక ఆక్షాంక్షలు, అవసరాలు తీరేందుకు శరీర ధర్మానికి అనుగుణంగా కొన్ని పద్ధతులు వాటంతటవే ఏర్పడిపోతాయి. భావప్రాప్తే అంతిమ లక్షంలా పెనువేసుకుపోవడం ప్రకృతి రీత్యా సహజ సంగమం కిందే లెక్క. అది ఆ ఇరువురి వ్యక్తిగత విషయము వారి ఆరాటం సమాజంలోని ఇతరుల జీవన విధానానికి, సాంసారిక జీవనానికి భిన్నంగా ఉండవచ్చు. కానీ ఆ భిన్నతే వారికి ఆవశ్యకం. ఇరువురి లింగపరమైన తేడాను పక్కన పెట్టి వారికి ఆమోదయోగ్యమైన రీతిలో ఇష్టపూర్వకంగా జీవించే హక్కును కాలరాయడమంటే రాజ్యాంగాన్ని అడ్డుకోవడమే. సెక్షన్ 377 రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకే భంగకరంగా ఉంది. రాజ్యాంగంలోని సెక్షన్14 సమానంగా జీవించే హక్కును, సెక్షన్15 లింగవివక్ష నుండి రక్షణను, సెక్ష న్ 19 గోప్యతను కాపాడడం, సెక్షన్ 21 గౌరవంగా బతికే హక్కును దేశంలోని ప్రతి పౌరుడికి ప్రసాదించా యి.

స్వలింగ ఆకర్షణను చట్ట పరిధిలోకి తేవడమే సామాజికద్రోహం. నాలుగు గోడల మధ్య జరిగే ప్రక్రియను నేరంగా పరిగణిస్తూ శరీర నిర్మాణ రీత్యా పురి విప్పిన వారి ఆశలను అసహజమనే, శిక్షార్హమనే హక్కు ఎవరికీ లేదు.

భారత చరిత్రలోకి వెళితే లైంగిక సంపర్కం గురించి సహజ, అసహజ అనే విపరీత అర్థాలు లేని సంభోగ ప్రక్రియల గురించి శాస్త్రాలే లభిస్తాయి. క్రీ.శ. 550లో వరాహ మిహిరుడు రాసిన బృహత్ జాతకలో స్వలింగ సంపర్క ప్రస్తావన ఉంది. 45శతాబ్దాల మధ్య వాత్యాయనుడు శృంగార రచన కామసూత్రలో ‘ఔపారిష్టక’ అనే అధ్యాయమే ఉంది. అంగ చూషణం తదితర రాతి చెక్కడాలు దేవాలయాలపై కనిపిస్తాయి. క్రీ.శ. 12వ శతాబ్ద ప్రాంతంలో కొక్కోకుడు రచించిన రతి రహస్యంలో ఇలాంటి సంగమాలు సచిత్రంగా ఉన్నాయి.

ఒకనాడు సమాజ అంగీకారంతో, సహజ సమ్మతితో కొనసాగిన విభిన్న శృంగార రీతులు సంస్కా రం, ఆధునికత పేరిట చీత్కారానికి, చట్ట విరుద్ధతకు గురికావడం అమానవీయ చర్యగా భావించాలి. భారత సాయుధ దళాల స్మృతి 1950లో సెక్షన్ 46 అధికరణ 6లో కూడా స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించబడింది. సైనిక న్యాయస్థానంలో దీనికి ఏడేళ్ల జైలుశిక్ష వేయబడుతుంది. వైమానికదళ చట్టం 1950 లో కూడా ఇలాగే ఉంది. వియత్నాంతో యుద్ధంలో పాల్గొని పతకాలు, ప్రశంసలు అందుకున్న ఓ అమెరికా సైనికుడు చివరకు హోమో సెక్సువల్ కేసులో చిక్కి జైలు పాలయ్యాడు. బ్రిటిష్ చట్టాలను ఇంకా నెత్తిన పెట్టుకోవడం వల్ల ఇలా జరుగుతోంది.

1941లో ప్రసిద్ధ ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్ ‘లిహాఫ్’ అనే కథ రాసింది. ఇద్దరు స్త్రీల మధ్య లైంగిక అనుబంధమే ఈ కథ ముఖ్యాంశం. దీనిపై లాహోర్ కోర్టులో కేసు నడిచింది. స్వలింగ సంపర్కుల సమస్య ప్రధానంగా నసీమా అజీజ్ ‘ది ప్లూరల్ ఆఫ్ వన్’ అనే వీధి నాటకాన్ని రచించి ఢిల్లీ ప్రాంతంలో ప్రదర్శిస్తోంది.

హోమోలకు క్లబ్బులు, పత్రికలు కూడా ఉన్నాయి. 1985లో మొదలైన ‘అనామిక’ పత్రిక కొన్నేళ్లు నడిచింది. 1990 నుండి ‘బాంబే దోస్త్‌” అనే త్రైమాసిక అశోక్ రావ్ కవి సంపాదకత్వంలో వస్తోంది. ‘సభి’ ఢిల్లీ నుండి, గుల్‌బర్గా నుండి ఫ్రీడం పత్రికలు వస్తున్నా యి.

బెంగళూరులో గార్డెన్ సిటీ క్లబ్ భరణీ ధరన్ నేతృత్వంలో ఉంది. కలకత్తాలో పవన్ దాలే ఫన్‌క్లబ్ నడుపుతున్నారు.లక్నోలో శివేంద్ర ఫ్రెండ్స్ ఇండియాకు సారథి.