సలాం పోలీస్ అన్నా…

పోలీసులంటే కఠినంగా వ్యవహరిస్తారని వారికి స్పందించే హృదయం, మానవత్వం తక్కువగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ మథురలో ఓ నిండు గర్భవతిని ఓ పోలీసు తన చేతులపై కూర్చోబెట్టుకుని హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అంబులెన్స్‌కు ఫోన్ చేసినప్పటికీ అది సమయానికి రాకపోవడంతో అక్కడే ఉన్న ఒక పోలీసు అధికారి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. గుండెలు పిండేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.. ఈ నెల14న మథురా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ దగ్గర ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోంది. కోర్టు […]

పోలీసులంటే కఠినంగా వ్యవహరిస్తారని వారికి స్పందించే హృదయం, మానవత్వం తక్కువగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ మథురలో ఓ నిండు గర్భవతిని ఓ పోలీసు తన చేతులపై కూర్చోబెట్టుకుని హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అంబులెన్స్‌కు ఫోన్ చేసినప్పటికీ అది సమయానికి రాకపోవడంతో అక్కడే ఉన్న ఒక పోలీసు అధికారి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. గుండెలు పిండేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది..

ఈ నెల14న మథురా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ దగ్గర ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోంది. కోర్టు పని మీద వెళుతున్న సోనుకుమార్ వెంటనే అక్కడికి వెళ్లి పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను చూసి వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. అంబులెన్స్ రాలేదు. దీంతో ఆమెను దగ్గరలోని సాధారణ హాస్పిటల్‌కు మోసుకెళ్లాడు. అయితే ఆమె పరిస్థితి క్రిటికల్‌గా ఉందని అక్కడి వారు చెప్పారు. వెంటనే పెద్ద హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలని చెప్పారు. అక్కడ స్ట్రెచ్చర్ కూడా లేకపోవడంతో సోనుకుమార్ గర్భవతిని హాస్పిటల్ వరకు మోసుకెళ్లాడు. ఆ మహిళ భర్త సహాయం కోసం అక్కడి స్థానికులను అర్థించడం తనను కలచివేసిందని ఆ పోలీసు చెప్పాడు. వెంటనే ఆసుపత్రిలోకి వెళ్లిన తరువాత ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నొప్పులు తీవ్రతరమై ఉండగా తనను హాస్పిటల్‌కు సకాలంలో చేర్చిన సోనుకుమార్‌కు ఆ మహిళ కృతజ్ఞతలు తెలిపారు. మహిళ భావన భర్త మహేష్ కూడా తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు పోలీసుకు ధన్యవాదాలు చెప్పాడు. ఈ సంఘటన గురించి మథురా పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజెన్లు పోలీస్ సోనుకుమార్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.