అందమైన అమ్మాయితో రొమాన్స్!

మన్మథుడు, బాస్, కింగ్ వంటి పలు చిత్రాల్లో నటించిన హీరో నాగార్జున. చాలా రోజుల తరువాత ఓ అందమైన అమ్మాయితో రొమాన్స్ చేసే అవకాశం దక్కిందని నాగార్జున చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాగ్, నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ’దేవదాస్’ . ఈ సినిమాలో నాగ్ ’దేవ్’ పాత్రలో నటిస్తుండగా, ఆయన సరసన తొలిసారిగా ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో ఆకాంక్ష ’జాహ్నవి’ పాత్రలో నటిస్తుండగా, ఆమెను పరిచయం చేస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో […]


మన్మథుడు, బాస్, కింగ్ వంటి పలు చిత్రాల్లో నటించిన హీరో నాగార్జున. చాలా రోజుల తరువాత ఓ అందమైన అమ్మాయితో రొమాన్స్ చేసే అవకాశం దక్కిందని నాగార్జున చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాగ్, నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ’దేవదాస్’ . ఈ సినిమాలో నాగ్ ’దేవ్’ పాత్రలో నటిస్తుండగా, ఆయన సరసన తొలిసారిగా ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో ఆకాంక్ష ’జాహ్నవి’ పాత్రలో నటిస్తుండగా, ఆమెను పరిచయం చేస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టర్ ను విడుదల చేసిన నాగ్, ‘చాలా రోజులు తరవాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి!! యా… రొమాన్స్ ఎగైన్‘ అని వ్యాఖ్యానించాడు. ఈ సినిమా పాట లిరికల్ వీడియోను విడుదల చేశాడు. ఇక తెరపై హీరోయిన్లతో రొమాన్స్‌ను పండించే నాగ్, ఆకాంక్షతో చేసే రొమాంటిక్ సన్నివేశాల గురించి తెలియాలంటే, ఈ నెల 27 వరకూ వేచి చూడక తప్పదు. ప్రస్తుతం ఈ పోస్ట్‌పై అభిమానులు పలు కామెంట్స్ చేస్తున్నారు.